త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | రండి.. చ‌రిత్ర‌ సృష్టిద్దాం.. ఓటింగ్ వేళ ఎంపీల‌కు ప్ర‌ధాని పిలుపు

PM Modi | కీల‌క బిల్లుల‌పై లోక్‌స‌భ‌లో మ‌రికాసేప‌ట్లో ఓటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదిక‌గా ఓ కీల‌క పోస్ట్ పెట్టారు.

D

National | Published On Apr 17, 2026, 3.36 pm IST

PM Modi | రండి.. చ‌రిత్ర‌ సృష్టిద్దాం.. ఓటింగ్ వేళ ఎంపీల‌కు ప్ర‌ధాని పిలుపు
Advertisement

PM Modi | కీల‌క బిల్లుల‌పై లోక్‌స‌భ‌లో మ‌రికాసేప‌ట్లో ఓటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదిక‌గా ఓ కీల‌క పోస్ట్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు వారి హక్కులు దక్కాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ పూర్తి ప‌రిశీల‌న త‌ర్వాత రిజ‌ర్వేష‌న్ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

"నేను పార్లమెంటు సభ్యులందరికీ చెప్పేది ఒక్కటే.. మీ ఇంట్లోని మీ తల్లి, సోదరి, కుమార్తె, భార్యను మనసులో ఉంచుకుని మీ అంతరాత్మ చెప్పినట్లు వినండి. దేశంలోని నారీ శ‌క్తికి సేవ చేయ‌డానికి, వారిని గౌర‌వించ‌డానికి ఇది ఒక గొప్ప అవ‌కాశం. వారిని కొత్త అవకాశాలకు దూరం చేయకండి. ఈ చట్ట సవరణ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందితే, దేశంలో మహిళా సాధికారతతో పాటు ప్రజాస్వామ్యం కూడా బలోపేతం అవుతుంది. రండి.. మ‌నంద‌రం క‌లిసి ఈ రోజు చ‌రిత్ర‌ సృష్టిద్దాం. దేశంలోని మ‌హిళ‌ల‌కు ద‌క్కాల్సిన న్యాయ‌మైన వాటాను వారికి అందిద్దాం" అని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. కోట్లాది మంది మహిళలు మనల్ని గమనిస్తున్నారని.. మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చట్టసభ సభ్యుల నిర్ణయాలను, వారి ఉద్దేశాలను కోట్లాది మంది మహిళలు గమనిస్తున్నారని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఈ సవరణలపై జరిగిన చర్చలు అన్ని రకాల ఆందోళనలను, అపోహలను తొలగించాయని చెప్పుకొచ్చారు.

Also Read..

అమ‌ల్లోకి రాని చ‌ట్టానికి స‌వ‌ర‌ణ ఎలా సాధ్యం.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ ఫైర్‌

"ఇది మహిళల బిల్లు కాదు, దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చే కుట్ర".. లోక్‌సభలో రాహుల్ గాంధీ ఫైర్

వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మ‌స్క్ ఎక్స్ చాట్‌.. నేటి నుంచే ల‌భ్యం.. స్క్రీన్‌షాట్లు తీయ‌కుండా లాక్ ఫీచ‌ర్‌..

Advertisement
Advertisement