TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
TTD | శ్రీవారి ఆలయంలో జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే వివిధ పర్వదినాలు, వార్షిక ఉత్సవాల నేపథ్యంలో పలు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఆయా తేదీల్లో ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించనున్నందున దర్శనాల నిర్వహణలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది.
Devotional | Published On Jul 8, 2026, 6.05 pm IST
TTD | శ్రీవారి ఆలయంలో జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే వివిధ పర్వదినాలు, వార్షిక ఉత్సవాల నేపథ్యంలో పలు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఆయా తేదీల్లో ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించనున్నందున దర్శనాల నిర్వహణలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా, జూలై 17న ఆణివార ఆస్థానం నిర్వహణ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద కార్యక్రమం, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా కూడా బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఆగస్టు నెలలో పవిత్రోత్సవాల సందర్భంగా కూడా దర్శనాల్లో మార్పులు చేశారు. ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ కార్యక్రమాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి.
సెప్టెంబర్ నెలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా మరిన్ని రోజుల్లో బ్రేక్ దర్శనాలు నిలిపివేయనున్నారు. సెప్టెంబర్ 8న బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న అంకురార్పణ కార్యక్రమం, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆయా తేదీలకు ముందురోజు నుంచి తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఎలాంటి వీఐపీ సిఫారసలు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని సూచించింది. ముఖ్యంగా వీఐపీ సిఫార్సు లేఖల ఆధారంగా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు సంబంధిత తేదీలను పరిశీలించి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యే తేదీల వివరాలు..
జూలై 14 : కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
జూలై 17 : ఆణివార ఆస్థానం
జూలై 19 : శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
జూలై 2 : జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
ఆగస్టు 22 : పవిత్రోత్సవాల అంకురార్పణ
ఆగస్టు 24 : పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ
సెప్టెంబర్ 8 : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సెప్టెంబర్ 14 : శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






