త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Accident | 9 గంట‌ల‌కు పెండ్లి.. కొబ్బ‌రి పొట్టు లారీ రూపంలో మృత్యువు..

Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మార్కాపురం (Markapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జ‌రిగింది. పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకున్న‌ది. ఆల‌యం వ‌ద్ద ఆగి ఉన్న పెండ్లి ఆటోను వెనుక నుంచి వ‌చ్చిన లారీ ఢీకొట్టింది.

G

National | Published On Jul 3, 2026, 8.04 am IST

Accident | 9 గంట‌ల‌కు పెండ్లి.. కొబ్బ‌రి పొట్టు లారీ రూపంలో మృత్యువు..
Advertisement

Accident | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మార్కాపురం (Markapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జ‌రిగింది. పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకున్న‌ది. ఆల‌యం వ‌ద్ద ఆగి ఉన్న పెండ్లి ఆటోను వెనుక నుంచి వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో నాలుగేండ్ల చిన్నారి స‌హా న‌లుగురు మృతిచెందారు. వ‌ధువుతోపాటు మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కంభం పట్టణంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గురువారం అర్ధ‌రాత్రి 1.15 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘోరం జ‌రిగింది.

కంభం ప‌ట్ట‌ణంలో న‌ల్లబండ బజారుకు చెందిన వీరక్కకు కంభముకు చెందిన పాములేటికి శుక్ర‌వారం ఉదయం 9 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. వేడుక‌లో భాగంగా అంకాలు (22), అల‌క‌నంద (18) దంప‌తులు, నాగేశ్ (18), నాగ‌ల‌క్ష్మి (4), మ‌రికొంద‌రు వ‌ధువుతో క‌లిసి కంభంలోని వై జంక్షన్ వద్ద వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టేందుకు ఆటోలో వెళ్లారు. ఆల‌యం వ‌ద్ద మిగ‌తా వారంతా దిగి ఓ ప‌క్క‌న నిల్చోగా, వీరు న‌లుగురు మాత్రం అందులోనే ఉండిపోయారు. అదేస‌మ‌యంలో మ‌ద‌న‌ప‌ల్లె నుంచి వైరాకు కొబ్బ‌రి పొట్టు ఎరువు లోడుతో వెళ్తున్న లారీ.. ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్ర‌మాదం ధాటికి నుజ్జునుజ్జుయింది. దీంతో అందులో ఉన్న అంకాలు, అల‌క‌నంద‌, నాగేశ్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. తీవ్రంగా గాయ‌ప‌డిన చిన్నారి నాగ‌ల‌క్ష్మిని మెరుగైన వైద్యం కోసం మ‌ర్కాపురం ద‌వాఖాన‌కు తీసుకెళ్తుండ‌గా మర‌ణించింది. వ‌ధువుతో వీర‌క్క‌తోపాటు ఏడుగురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement