త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tying Dog | మండే ఎండ‌లో కుక్క‌ను క‌ట్టేసినందుకు య‌జ‌మానికి శిక్ష‌..

Tying Dog | సూర్యుడు సుర్రున (Scorching Sun)మండిపోతున్నాడు. ఎండ మ‌నుషులే త‌ట్టుకోలేక‌పోతున్నారు. మ‌రి జంతుల ప‌రిస్థితి ఏంటి? అందులోనూ శున‌కాల సంగ‌తి?.

G

National | Published On Apr 25, 2026, 8.43 am IST

Tying Dog | మండే ఎండ‌లో కుక్క‌ను క‌ట్టేసినందుకు య‌జ‌మానికి శిక్ష‌..
Advertisement

Tying Dog | త్రినేత్ర‌.న్యూస్‌: సూర్యుడు సుర్రున (Scorching Sun)మండిపోతున్నాడు. ఎండ మ‌నుషులే త‌ట్టుకోలేక‌పోతున్నారు. మ‌రి జంతుల ప‌రిస్థితి ఏంటి? అందులోనూ శున‌కాల సంగ‌తి?. హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి.. త‌న పెంపుడు కుక్క‌ను మండే ఎండ‌లో క‌ట్టేశాడు (Tying Dog). అందులోనూ ఇరుకుగా ఉన్న సందులో. ఓ వైపు ఎండ‌, మ‌రోవైపు క‌ద‌లడానికి జాగ లేదు. దాని బాధను గ‌మనించిన ప‌లువురు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దానిని విడిపించిన పోలీసులు.. మూగ జీవిప‌ట్ల నిర్ధ‌య‌గా వ్య‌వ‌హ‌రించిన అత‌నిపై కేసు న‌మోదుచేశారు. న్యాయ‌స్థానం అత‌నికి శిక్ష కూడా విధించింది.

ఫ‌రీదాబాద్‌లోని పూరి ప్ర‌ణ‌యం సొసైటీ సెక్టార్ 82లో ఉంటున్న దీప‌క్ శ‌ర్మ అనే వ్య‌క్తి ఓ శున‌కాన్ని పెంచుకుంటున్నాడు. 2024, జూన్ 20న త‌న పెంపుడు కుక్క‌ను ఇంటి బ‌య‌ట ఓ ఇరుకైన ప్ర‌దేశంలో క‌ట్టేశాడు. అయితే ఎండ వేడిమి త‌ట్టుకోలేక అది అరుస్తున్నా దీప‌క్ ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో స్థానికులు పీపుల్స్ ఫ‌ర్ యానిమ‌ల్స్ యూనిట్‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో వృందా శ‌ర్మ అనే మ‌హిళ.. పోలీసులతో అక్క‌డికి వ‌చ్చి ఆ శున‌కాన్ని విడిపించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దీప‌క్‌పై సెక్ష‌న్ 11 (జంతు హింస) ప్ర‌కారం కేసు న‌మోదుచేశారు. అనంత‌రం నిందితుడిని అరెస్టు చేసి.. అత‌నిపై కోర్టులో చార్జిషీట్ స‌మ‌ర్పించారు. ఈ క్ర‌మంలో కోర్టు ఐపీసీ సెక్ష‌న్ 429 కూడా జ‌త‌చేసింది. దీనిప్ర‌కారం జంతువుల‌పై హింకు పాల్ప‌డిన వారికి రూ.100 జ‌రిమానా విధిస్తారు. సెక్ష‌న్ 11 ప్ర‌కారం రూ.50 ఫైన్ వేస్తారు.

కాగా, ఈ కేసును విచారించిన ప్ర‌త్యేక జ‌డ్జి జితేంద్ర సింగ్‌.. కేసు న‌మోదైన‌ 15 నెల‌ల త‌ర్వాత దినేశ్ శ‌ర్మ‌ను దోషిగా తేల్చారు. అత‌నికి శిక్ష‌గా రూ.1050 ఫైన్ విధించారు.

 

Advertisement
Advertisement