Credit Score | ఆదాయం ఎక్కువగా ఉన్నా క్రెడిట్ స్కోరు పెరగడం లేదా.. కారణాలు ఇవే..!
Credit Score | ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ చాలా మంది తమ క్రెడిట్ స్కోరు వేగంగా పెరగడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే ఆదాయం ఎప్పుడూ ప్రత్యక్షంగా క్రెడిట్ స్కోరును ప్రభావం చేయదు. చెల్లింపులు చేస్తాయి.
Credit Score | ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ చాలా మంది తమ క్రెడిట్ స్కోరు వేగంగా పెరగడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే ఆదాయం ఎప్పుడూ ప్రత్యక్షంగా క్రెడిట్ స్కోరును ప్రభావం చేయదు. చెల్లింపులు చేస్తాయి. ఎంత ఎక్కువ ఆదాయం ఉందనే అంశంకన్నా, ఎంత మెరుగ్గా చెల్లింపులు చేస్తున్నారు, ఎంత బాధ్యతాయుతంగా ఖర్చు చేస్తున్నారు అనే విషయాలనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. ఆ అంశాల ఆధారంగానే రుణ గ్రహీతలు లేదా క్రెడిట్ కార్డు హోల్డర్ల క్రెడిట్ స్కోరును సంస్థలు లెక్కిస్తుంటాయి. అందువల్ల ఆదాయం ఎక్కువగా ఉండడం ఒక్కటే కాదని, ఆయా విషయాల్లోనూ మెరుగు పడాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
చెల్లింపులు, లోన్లు, లిమిట్ నిష్పత్తి..
సాధారణంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఎంత ఆదాయం ఉన్నప్పటికీ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నారా, లేదా అనే విషయాలనే తనిఖీ చేస్తాయి. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులను పూర్తిగా చెల్లిస్తున్నారా, మినిమం మొత్తం కడుతున్నారా, కార్డు లిమిట్‌లో ఎంత మేర క్రెడిట్ వాడుతున్నారు.. అనే విషయాలను కూడా తరచూ చెక్ చేస్తాయి. సాధారణంగా క్రెడిట్ కార్డుల్లో ఎల్లప్పుడూ 30 నుంచి 40 శాతం మేర లిమిట్ ఖాళీగా ఉండేలా చూడాలి. దీన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక స్థితికి సూచికగా భావిస్తాయి. కార్డు లిమిట్‌లో చాలా మంది 95 శాతానికి పైగా ఖర్చు చేస్తారు. అయితే అలా ఖర్చు చేసినప్పుడు బిల్లు మొత్తాన్ని చెల్లిస్తున్నారా, లేదా అనే విషయాన్ని సంస్థలు చెక్ చేస్తాయి. బిల్లు మొత్తం చెల్లిస్తే కార్డుదారుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని అంచనా వేస్తాయి. అదే వాడకం ఎక్కువగా ఉండి, బిల్లును మాత్రం మినిమం మొత్తం కడుతుంటే అప్పుడు కార్డుదారుల ప్రొఫైల్‌ను రిస్క్ జాబితాలో చేరుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజులు లేదా నెలల అనంతరం సంస్థలు మళ్లీ చెల్లింపు స్థితిని పరిశీలించి ఇంకా అలాగే రిస్క్ లోనే ఉంటే అప్పుడు కార్డు లిమిట్‌ను తగ్గించడం లేదా కార్డుదారులు సులభ ఈఎంఐలలో కార్డు బిల్లును చెల్లించేందుకు సౌకర్యాన్ని కల్పిస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డుల వాడకంతోపాటు బిల్లు చెల్లింపుల విషయంలోనూ కార్డు దారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఆదాయానికి సమానంగా ఖర్చు ఉంటే..
ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ దానికి ఇంచుమించు సమానంగా ఈఎంఐలు లేదా నెలవారీ చెల్లింపులు ఉన్నా కూడా సంస్థలు అలాంటి వ్యక్తుల ప్రొఫైల్‌ను రిస్క్ జాబితాలోనే చేరుస్తాయి. ఎందుకంటే ఆదాయ మార్గాన్ని కోల్పోతే ఈఎంఐలు, బిల్లు చెల్లింపులకు ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వ్యక్తుల ప్రొఫైల్ రిస్క్ జాబితాలో చేరుతుంది. ఇలాంటి పరిస్థితిని కూడా సంస్థలు రిస్క్‌గానే పరిగణిస్తాయి. నెల నెలా ఎంత ఆదాయం వస్తుంది, అందులో చెల్లింపులు ఎంత, ఆదాయానికి, లోన్లకు, చెల్లింపులకు మధ్య ఉన్న నిష్పత్తి వివరాలు వంటి అంశాలను సంస్థలు తనిఖీ చేస్తుంటాయి. ఇవన్నీ పాజిటివ్‌గా ఉంటేనే సిబిల్ స్కోరులో వేగంగా మార్పులు వస్తాయి. లేదంటే స్కోరు పెరగకుండా అక్కడే ఉంటుంది.
ఆర్థిక క్రమ శిక్షణ, పొదుపు, ఉద్యోగ స్థిరత్వం..
అలాగే ఆర్థిక క్రమ శిక్షణ ఉందా, పొదుపు చేస్తున్నారా, బ్యాంకు ఖాతాల్లో నిల్వ మొత్తం ఎంత ఉంది, ఉద్యోగ స్థిరత్వం ఉందా వంటి అంశాలను కూడా సంస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తాయి. వీటి ఆధారంగా కూడా వ్యక్తుల క్రెడిట్ ప్రొఫైల్‌ను బేరీజు వేసి ఆ తరువాత క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే నెల నెలా స్కోరు మారుతుంది. అన్నీ సక్రమంగా ఉండి, చెల్లింపులు కూడా సరిగ్గా ఉంటే క్రెడిట్ స్కోరు వేగంగా పెరగడాన్ని గమనించవచ్చు. ఇలాంటి వ్యక్తులకు సంస్థలు త్వరగా లోన్లు లేదా క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. అందువల్ల ఎంత ఎక్కువ ఆదాయం ఉందన్న విషయం కాకుండా ఏ మేర ఆర్థిక క్రమ శిక్షణ ఉంది, చెల్లింపులు ఎలా ఉన్నాయి అన్న విషయాలపై దృష్టి సారించాలని, దీంతో క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Loan Prepayment | లోన్‌ను ముందే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా.. అసలు నిజం ఇదే..
సెప్టెంబర్ 12, 2026

Debt Management | అప్పులు పెరుగుతున్నాయా? ఇలా అదుపులో పెట్టండి..
ఆగస్టు 31, 2026

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..
- ●GV Prasad | నారాయణపేట డీఎఫ్‌వో అరుదైన ఘనత
- ●TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు
- ●Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్
- ●Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే - ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది - రిలీజ్ డేట్‌పై క్లారిటీ
- ●Minister Ponguleti | కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ధరణి

Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..

GV Prasad | నారాయణపేట డీఎఫ్‌వో అరుదైన ఘనత

TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు

Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్



