త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు

Gold Robbery Dubbaka | కుటుంబ స‌భ్యుల‌తో ఓ వ్య‌క్తి కాశీ వెళ్ల‌గా దుండ‌గులు కిలో బంగారం ఎత్తుకెళ్లారు. ఈ భారీ చోరీ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా దుబ్బాక ప‌ట్ట‌ణంలో ఆదివారం అర్ధ‌రాత్రి చోటుచేసుకుంది.

S

Telangana | Published On Jun 29, 2026, 1.09 pm IST

Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు
Advertisement
  • దుబ్బాక‌లో ఘ‌ట‌న‌

Gold Robbery Dubbaka | త్రినేత్ర‌.న్యూస్‌: కుటుంబ స‌భ్యుల‌తో ఓ వ్య‌క్తి కాశీ వెళ్ల‌గా దుండ‌గులు కిలో బంగారం ఎత్తుకెళ్లారు. ఈ భారీ చోరీ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా దుబ్బాక ప‌ట్ట‌ణంలో ఆదివారం అర్ధ‌రాత్రి చోటుచేసుకుంది. సోమ‌వారం ఉద‌యం ప‌నిమ‌నిషి మంజుల వ‌చ్చి చూసి య‌జ‌మానికి స‌మాచారం అందించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికుల ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

దుబ్బాక పట్టణంలోని 15వ వార్డులో చింత రాజ్‌కుమార్ నివాసం ఉంటున్నాడు. ఇత‌ను మెడికల్ ఏజెన్సీ నిర్వాహిస్తున్నాడు. కాగా తొమ్మిది రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లాడు. ఇది గ‌మ‌నించిన దుండ‌గులు ఆదివారం అర్ధరాత్రి ఇంటి కిటికీ ఊచలను విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. పడకగదిలోని లాకర్‌ను పగలగొట్టి అందులోని బంగారం, నగదును అప‌హ‌రించారు.

సోమవారం ఉదయం ఇంటి ఆవరణను శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి మంజుల ఇంటి తాళాలు పగలగొట్టి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే యజమానికి సమాచారం అందించ‌గా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తన సిబ్బందితో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని క్లూస్‌ టీమ్‌తో ద‌ర్యాప్తు చేస్తున్నారు. అనంత‌రం సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సైతం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. దుండ‌గుల‌ను ప‌ట్టుకోవ‌డానికి గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. బంగారం సుమారు కేజీ వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement
Advertisement