త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | పార్ల‌మెంటును ప్రొరోగ్ చేయ‌డంలో ఆల‌స్యం.. ప్ర‌ధాని మోదీకి ఖ‌ర్గే లేఖ

Mallikarjun Kharge | పార్లమెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు నిరవధిక వాయిదా తర్వాత దానిని అధికారికంగా ముగించడానికి జరుగుతున్న జాప్యంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. సమావేశాలు ముగిసి 64 రోజులు గడిచినా ఉభయ సభలను ప్రోరోగ్ (Prorogue) చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

D

National | Published On Oct 16, 2026, 4.46 pm IST

Mallikarjun Kharge | పార్ల‌మెంటును ప్రొరోగ్ చేయ‌డంలో ఆల‌స్యం.. ప్ర‌ధాని మోదీకి ఖ‌ర్గే లేఖ
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే లేఖ రాశారు. పార్లమెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు నిరవధిక వాయిదా తర్వాత దానిని అధికారికంగా ముగించడానికి జరుగుతున్న జాప్యంపై కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. సమావేశాలు ముగిసి 64 రోజులు గడిచినా ఉభయ సభలను ప్రోరోగ్ (Prorogue) చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప‌రిస్థితిని పార్లమెంటరీ చరిత్రలోనే అపూర్వమైనదిగా అభివర్ణించారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఏప్రిల్ 17న స‌భ‌లో వీగిపోయిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే గుర్తు చేశారు. గ‌త సెష‌న్‌లోలాగానే ఈ బిల్లును మ‌ళ్లీ బ‌ల‌వంతంగా రుద్ద‌డానికి ప్ర‌య‌త్నించొద్ద‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టే ముందు.. సవరించిన ప్రతిపాదనలపై చ‌ర్చించేందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌తిపాదిత బిల్లుల‌పై చ‌ర్చించేందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుతూ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో తాను ప‌దేప‌దే లేఖ‌లు రాసిన విష‌యాన్ని ఖ‌ర్గే లేఖ‌లో ప్ర‌స్తావించారు.

కాగా, ఈ విష‌యంపై ప్ర‌ధానికి ఖ‌ర్గే లేఖ రాయ‌డం ఇది నాలుగోసారి కావ‌డం గ‌మ‌నార్హం. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏప్రిల్ 11న ప్రధానమంత్రికి తొలిసారి లేఖ రాశారు. అయితే, త‌ద‌నంత‌రం లోక్‌స‌భ‌లో ఆ బిల్లు ఆమోదం పొంద‌లేదు. ఆ త‌ర్వాత జులై 16, ఆగ‌స్టు 27తేదీల్లో ప్ర‌ధానికి అఖిల‌ప‌క్ష స‌మావేశం కోరుతూ లేఖ‌లు రాశారు. అయితే, డీలిమిటేష‌న్‌, మ‌హిళా బిల్లుల ఆమోదం కోసం ఈ నెలాఖ‌రులో పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల‌కు కేంద్రం సిద్ధ‌మ‌వుతోందంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇవాళ నాలుగోసారి త‌న అభ్య‌ర్థ‌న‌ను పున‌రుద్ఘాటిస్తూ ప్ర‌ధానికి ఖ‌ర్గే లేఖ రాయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read..

ఢిల్లీని ప్రభుత్వం వార్ జోన్ గా ప్రకటించినందువల్లే బిజినెస్ లాస్..! నిరసనలు కారణం కాదు : అభిజీత్ దిప్కే

18 ఏళ్ల చిన్నారిని ఆరో అంత‌స్తు నుంచి తోసేసిన 10 ఏళ్ల బాలిక‌

టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి వచ్చేసింది.. నెట్‌వ‌ర్క్‌ లేకున్నా కమ్యూనికేషన్..

Advertisement
Advertisement