Mumbai | 18 ఏళ్ల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి తోసేసిన 10 ఏళ్ల బాలిక
Mumbai | ఓ 10 ఏళ్ల బాలిక.. 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Mumbai | త్రినేత్ర న్యూస్ : ఓ 10 ఏళ్ల బాలిక.. 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.
గోరెగావ్ ఏరియాలో బుధవారం రాత్రి సమయంలో 18 నెలల చిన్నారిని 10 ఏళ్ల బాలిక తీసుకుని ఆరో అంతస్తుకు వెళ్లింది. ఇక అక్కడ్నుంచి చిన్నారిని కిందకు తోసేసింది. అనంతరం బాలిక మెట్లపై నుంచి పరుగెత్తుకుంటూ కిందకు వచ్చింది. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
చిన్నారి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాపను హత్య చేసిన బాలికతో పాటు ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ప్రతీకారంగా చిన్నారిని బలి తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ఘటనకు అసలు కారణమేంటనే దానిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్లో బుల్ జోరు.. 18 ఏళ్లలో అత్యధిక లాభాల వారం..
- ●KTR | ఆంధ్రాలో జల పండుగ..! తెలంగాణలో క్రాప్ హాలీడే..!
- ●Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్దీప్కు గాయం!
- ●TECNO Spark 50s 5G | టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి వచ్చేసింది.. నెట్వర్క్ లేకున్నా కమ్యూనికేషన్..
- ●Faria Abdullah | పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫరియా అబ్దుల్లా - హిట్టు కోసం రూటు మార్చిన హైదరాబాదీ బ్యూటీ
- ●Air India | సౌదీ అరేబియాకు విమానాల రద్దు.. అక్టోబర్ 20 వరకు ఎయిర్ ఇండియా సేవలు నిలిపివేత

Stock Markets | దలాల్ స్ట్రీట్లో బుల్ జోరు.. 18 ఏళ్లలో అత్యధిక లాభాల వారం..

KTR | ఆంధ్రాలో జల పండుగ..! తెలంగాణలో క్రాప్ హాలీడే..!

Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్దీప్కు గాయం!

TECNO Spark 50s 5G | టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి వచ్చేసింది.. నెట్వర్క్ లేకున్నా కమ్యూనికేషన్..






