Prabhas | ఎట్టకేలకు ప్రభాస్ కల్కి 2 షూటింగ్ షురూ – సాయిపల్లవి కోసం వెయిటింగ్?
ఫౌజీ, స్పిరిట్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా కల్కి 2 సెట్స్‌లో అడుగుపెట్టాడు. గురువారం నుంచి హైదరాబాద్‌లో కల్కి సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి సాయిపల్లవి ఈ మైథాలజీ మూవీ చిత్రీకరణలో భాగం కానున్నట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Oct 16, 2026, 4.39 pm IST
Prabhas | టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా కొనసాగుతోన్నారు ప్రభాస్. ఇన్నాళ్లు నాలుగైదేళ్లకు ఓ ఓ సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలు అంగీకరించారు. ఫౌజీ, స్పిరిట్ షూటింగ్‌లతో బిజీగా రెబెల్ స్టార్ తాజాగా కల్కి 2 సెట్స్‌లో అడుగుపెట్టారు.
నాగ్ అశ్విన్ డైరెక్టర్...
కల్కి 2898 ఏడీకి సీక్వెల్‌గా కల్కి 2 తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కల్కి 2 షూటింగ్ గురువారం నుంచి మొదలైంది. శంషాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో ప్రభాస్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. అక్టోబర్ 19వ వరకు హైదరాబాద్‌లో షూట్ చేసి...దసరా తర్వాత ముంబైలో మరో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
సాయిపల్లవి కోసం వెయిటింగ్...
కల్కి 2898 ఏడీలో హీరోయిన్గా నటించిన దీపికా పడుకోణ్...దర్శకనిర్మాతలతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సీక్వెల్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో కల్కి 2లో సాయిపల్లవిని కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్లో సాయిపల్లవి కూడా పాల్గొనాల్సింది. కానీ రామాయణ ప్రమోషన్స్ కారణంగా కుదరలేదని సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్‌లో కల్కి 2 షూటింగ్లో సాయిపల్లవి జాయిన్ కాబోతున్నట్లు చెబుతున్నారు.
కమల్‌హాసన్ విలన్...
కల్కి 2లో కమల్‌హాసన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. పార్ట్ వన్ 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం, నేషనల్ అవార్డుల్లో సత్తా చాటడంతో సీక్వెల్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది చివరలో కల్కి 2 థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
2027లో కల్కి 2తో పాటు ప్రభాస్ హీరోగా నటించిన ఫౌజీ, స్పిరిట్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. స్పిరిట్ సినిమాకు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తోండగా... ఫౌజీ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
అక్టోబర్ 15, 2026

Jailer 2 Review | జైలర్ 2 రివ్యూ – రజనీకాంత్ హీరోయిజం, ఎలివేషన్లు ఓకే కానీ … కానీ కథ ఏది?
అక్టోబర్ 15, 2026

Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది – అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు.. 18 ఏళ్లలో అత్యధిక లాభాల వారం..
- ●KTR | ఆంధ్రాలో జల పండుగ..! తెలంగాణలో క్రాప్ హాలీడే..!
- ●Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్‌దీప్‌కు గాయం!
- ●TECNO Spark 50s 5G | టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి వచ్చేసింది.. నెట్వర్క్ లేకున్నా కమ్యూనికేషన్..
- ●Faria Abdullah | పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫరియా అబ్దుల్లా - హిట్టు కోసం రూటు మార్చిన హైదరాబాదీ బ్యూటీ
- ●Air India | సౌదీ అరేబియాకు విమానాల రద్దు.. అక్టోబర్ 20 వరకు ఎయిర్ ఇండియా సేవలు నిలిపివేత

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు.. 18 ఏళ్లలో అత్యధిక లాభాల వారం..

KTR | ఆంధ్రాలో జల పండుగ..! తెలంగాణలో క్రాప్ హాలీడే..!

Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్‌దీప్‌కు గాయం!

TECNO Spark 50s 5G | టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి వచ్చేసింది.. నెట్వర్క్ లేకున్నా కమ్యూనికేషన్..



