త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Travel Bus | అనంత‌పురంలో ట్రావెల్స్ బ‌స్సు ద‌గ్ధం.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం

Travel Bus | బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travel Bus) అగ్నికి (Fire Accident) ఆహుత‌యింది. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది.

G

Andhra pradesh | Published On Sep 4, 2026, 8.51 am IST

Travel Bus | అనంత‌పురంలో ట్రావెల్స్ బ‌స్సు ద‌గ్ధం.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం
Advertisement

Travel Bus | త్రినేత్ర‌.న్యూస్‌: బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travel Bus) అగ్నికి (Fire Accident) ఆహుత‌యింది. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది.

33 మంది ప్ర‌యాణికుల‌తో వింట‌ర్‌సిటీ స‌ర్వీసెస్‌కు చెందిన ట్రావెల్స్ బ‌స్సు బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ (Hyderabad) వ‌స్తున్న‌ది. ఈ క్రమంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం (Ananthapuram) జిల్లా పెద్ద‌వ‌డుగూరు మండ‌లం మిడుతూరు స‌మీపంలో బ‌స్సులో పొగ‌లు వ‌స్తుడ‌టాన్ని గ‌మనించిన డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

వెంట‌నే బ‌స్సును నిలిపి అందులో నుంచి ప్ర‌యాణికుల‌ను దించేశారు. వారంతా దిగిన వెంట‌నే.. బ‌స్సు మొత్తం ద‌గ్ధ‌మైంది. ప్రాణ న‌ష్టం త‌ప్ప‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ (Short Circuit) కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement