JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
JNTU | హైదరాబాద్ కూకట్‌పల్లి జేఎన్టీయూలో (JNTU) విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రాత్రి వర్సిటీలో జరిగిన తీజ్ వేడుకల (Teej Celebrations) సందర్భంగా విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు.
JNTU | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ కూకట్‌పల్లి జేఎన్టీయూలో (JNTU) విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రాత్రి వర్సిటీలో జరిగిన తీజ్ వేడుకల (Teej Celebrations) సందర్భంగా విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో క్యాంపస్ రణరంగంగా మారింది.
గత రాత్రి వర్సిటీలో తీజ్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిపై (Students) పలువురు దాడిచేశారు. దీంతో గౌతమి, మంజీరా హాస్టల్ విద్యార్థుల మధ్య వివాదం మొదలైంది. పరస్పరం కర్రలతో విచక్షణా రహితంగా పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపాల్ సమాచారం అందించారు. హాస్టల్‌కు చేరుకున్న ప్రిన్సిపాల్, పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కాగా, బాధ్యులతపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
JNTUలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ
HYD: JNTUలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. గత రాత్రి తీజ్ పండుగ వేడుకల సందర్భంగా ఓ విద్యార్థిపై పలువురు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత మంజీరా హాస్టల్లోనూ విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. వర్సిటీ గేటు బయటకు వచ్చిన… pic.twitter.com/Zyi2oZJK8H
— BigTV APP (@BigtvApp) September 4, 2026
తాజావార్తలు
- ●ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం
- ●Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
- ●వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్కు ‘కొండంత’ నొప్పి!
- ●Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం

Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?

వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్కు ‘కొండంత’ నొప్పి!

Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!






