SIR | ఓటరు రికార్డులో వ్యత్యాసాలు.. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్ రెడ్డికి SIR నోటీసులు
SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా రికార్డుల్లో తేడాలున్న దాదాపు 93 లక్షల మందికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నోటీసులు జారీచేస్తున్నది. ఓటరు సమాచారంలో తప్పులు ఉండటం, పాత రికార్డులతో (2002 ఓటర్ల జాబితాతో) మ్యాపింగ్ కాకపోవడం, ఆధార్ కార్డులోని పేరు లేదా ఇంటిపేరు వివరాలు ఓటరు ఐడీతో సరిపోలకపోవడం వంటి కారణాలతో నోటీసులు (notices) పంపుతున్నది.
SIR | త్రినేత్ర.న్యూస్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా రికార్డుల్లో తేడాలున్న దాదాపు 93 లక్షల మందికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నోటీసులు జారీచేస్తున్నది. ఓటరు సమాచారంలో తప్పులు ఉండటం, పాత రికార్డులతో (2002 ఓటర్ల జాబితాతో) మ్యాపింగ్ కాకపోవడం, ఆధార్ కార్డులోని పేరు లేదా ఇంటిపేరు వివరాలు ఓటరు ఐడీతో సరిపోలకపోవడం వంటి కారణాలతో నోటీసులు (notices) పంపుతున్నది. అయితే ఇలా నోటీలు అందుకున్న వారిలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సీ.సుదర్శన్ రెడ్డి (C. Sudharshan Reddy) కూడా ఉండటం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా 92,87,577 మందికి ఎన్నికల కమిషన్ నోటీసులు అందిస్తున్నది. వీరిలో 60,50,918 మంది అనామలీస్ (మ్యాపింగ్ చేసిన వివరాల్లో తేడాలు) జాబితాలో ఉండగా, మరో 32,36,659 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ పత్రాల్లో ఎస్ఐఆర్-2002 వివరాలతో మ్యాపింగ్ చేయలేదు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఈఆర్వో లేదా ఏఈఆర్వో ముందు హాజరై కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించాలి. వారు చూపే గుర్తింపు కార్డు ఆధారంగా అర్హులను తేలుస్తారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్నారు. తాజాగా ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ. సుదర్శన్ రెడ్డికి కూడా నోటీసులు రావడం గమనార్హం.
ఇంటి పేరుతో..
అయితే ఆయన పేరు చివర లేదా మొదట్లో ఉండే ఇంటిపేరు అక్షరాల్లో (ఇనిషియల్స్) ఉన్న తేడాల వల్లే ఇది చోటుచేసుకున్నది. ఎస్ఐఆర్ (SIR) 2002 రికార్డులు, ఓటరు గుర్తింపు కార్డు (EPIC)లో సుదర్శన్ రెడ్డి ఇంటిపేరు కేవలం `C` అని మాత్రమే ఉండగా, ఆ తర్వాత జారీ చేసిన ఆధార్ కార్డులో ఆయన ఇంటిపేరు పూర్తి నమోదయింది. దీంతో సిస్టమ్ ఆధారితంగా సీఈవో కూడా నోటీలు జారీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు, నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ అవసరమైన వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సీఈఓ కూడా అదే విధంగా వివరాలను సమర్పిస్తారని తెలిపారు.
మొత్తం 92.88 లక్షల మంది ఓటర్లలో బుధవారం నాటికి 34 లక్షల మందికి పైగా నోటీసులు జారీ చేశారు. వీరిలో కనీసం 32 లక్షల మంది 'అన్‌మ్యాప్డ్' (మ్యాపింగ్ కాని) ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. అయితే ఇంటిపేరు అక్షరాల వంటి చిన్నపాటి తప్పులను ఫామ్ 8 (Form 8) సమర్పించడం ద్వారా సరిచేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

SIR | ముసాయిదా ఓటర్ల జాబితా.. కాంగ్రెస్ ఎంపీ పేరు మాయం
సెప్టెంబర్ 4, 2026

Raghav Chadha | పంజాబ్ ఓటరు జాబితా నుంచి రాఘవ్ చద్ధా పేరు మాయం.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు
సెప్టెంబర్ 3, 2026

Jharkhand SIR | జార్ఖండ్‌లో SIR వివాదం.. ఓటర్ల జాబితా నుంచి మైనారిటీల పేర్లు తొలగింపునకు బీజేపీ ఏజెంట్ల ప్రయత్నం
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
- ●Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- ●Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
- ●Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
- ●DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు



