త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Blast | కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష‌ నేత ఇంటి వ‌ద్ద పేలిన బాంబు.. హ‌త్యాయ‌త్నం జ‌రిగిందా?

Bomb Blast | మణిపూర్ (Manipur) కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ (CLP) ఇంటి బాంబు పేలుడు (Bomb Blast) సంభ‌వించింది. తౌబ‌ల్ జిల్లాలోని యైరిపోక్‌లో ఉన్న సీఎల్పీ నేత కే. మేఘచంద్ర సింగ్ (Meghachandra Singh) నివాసంపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు బాంబు విసిరారు.

G

National | Published On Sep 4, 2026, 6.41 am IST

Bomb Blast | కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష‌ నేత ఇంటి వ‌ద్ద పేలిన బాంబు.. హ‌త్యాయ‌త్నం జ‌రిగిందా?
Advertisement

Bomb Blast | త్రినేత్ర‌.న్యూస్‌: మణిపూర్ (Manipur) కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ (CLP) ఇంటి బాంబు పేలుడు (Bomb Blast) సంభ‌వించింది. తౌబ‌ల్ జిల్లాలోని యైరిపోక్‌లో ఉన్న సీఎల్పీ నేత కే. మేఘచంద్ర సింగ్ (Meghachandra Singh) నివాసంపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు బాంబు విసిరారు. ఇంటి ప్ర‌ధాన‌ గేటు వ‌ద్ద ప‌డిన అది ఒక్క‌సారిగా పేలింది. భారీ శ‌బ్ధంతో పేలుడు సంభ‌వించ‌డంతో (explosive) స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. అయితే ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు.

పేడులు జ‌రిగిన స‌మ‌యంలో మేఘ‌చంద్ర ఇంట్లో ఉన్నారా? లేదా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. కాగా, స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల‌తో ఆధారాలు సేక‌రించారు. దుండ‌గులు చేతి గ్రెనేడ్ (Hand Grenade) విరిసిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని చెప్పారు. ఈ దాడికి పాల్పడింది ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? అనేది ఇంకా తేల‌లేదు. మేఘ‌చంద్ర‌పై హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement