Flipkart GOAT Sale 2026 | ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ షురూ.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
Flipkart GOAT Sale 2026 | ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం గోట్ సేల్ 2026ను శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించింది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ సభ్యులకు 12 గంటల ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఇందులో పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Technology | Published On Jul 4, 2026, 1.09 pm IST
Flipkart GOAT Sale 2026 | ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం గోట్ సేల్ 2026ను శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించింది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ సభ్యులకు 12 గంటల ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఇందులో పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) హెడ్‌సెట్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, ఇతర గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ధర తగ్గింపులు ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించిన డిస్కౌంట్‌లతో పాటు క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్‌లు, ఎక్స్‌చేంజ్ బోనస్‌లను కూడా పొందే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 లో అందిస్తున్న డీల్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ ఐఫోన్ 17పై ఉంది. సాధారణంగా రూ.82,900 ధర కలిగిన ఐఫోన్ 17ను ఇప్పుడు రూ.70,900కే కొనుగోలు చేయవచ్చు.
తక్కువ ధరలకే కొత్త ఐఫోన్లు..
అదే విధంగా, 2025 సెప్టెంబర్‌లో భారత్‌లో విడుదలైన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 ప్రో కూడా భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీని సాధారణ ధర రూ.1,34,900 కాగా, సేల్‌లో ప్రభావవంతమైన ధర రూ.1,12,900గా ఉంది. శాంసంగ్ అభిమానుల కోసం కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్‌ఈ ఫోన్‌ను రూ.47,999కు, గెలాక్సీ ఎస్25ను రూ.69,999కు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ట్యాబ్లెట్‌లపై కూడా ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది. మోటో ప్యాడ్ 60 నియో, రెడ్‌మీ ప్యాడ్ 2, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ వంటి ట్యాబ్లెట్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ సేల్ మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఇంటెల్ కోర్ ఐ3 13వ జనరేషన్ ప్రాసెసర్‌తో వచ్చే ఆసుస్ వివోబుక్ 15తోపాటు మోటో బుక్ 60 ప్రో వంటి ల్యాప్‌టాప్‌లు కూడా తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి.
బ్యాంకు ఆఫర్లు సైతం..
ధర తగ్గింపులతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, అలాగే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అయితే, ఈ డీల్స్‌లో చూపిస్తున్న ప్రభావవంతమైన ధరల్లో నేరుగా ఇచ్చే ధర తగ్గింపులతోపాటు బ్యాంక్ డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా కలిపి ఉంటుందని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అందువల్ల కొనుగోలు చేసే ముందు ప్రతి ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?
- ●Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా
- ●KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నయ్ : కేటీఆర్
- ●Ranabaali | రణబాలి సినిమాపై డాక్యుమెంటరీ సిరీస్ - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ●KCR | కొండా లక్ష్మణ్ ఆశయాలను ఆచరిస్తేనే వారికి నిజమైన నివాళి: కేసీఆర్

Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?

Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా

KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నయ్ : కేటీఆర్

Ranabaali | రణబాలి సినిమాపై డాక్యుమెంటరీ సిరీస్ - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్






