త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress MLA | ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

Congress MLA | క‌ర్ణాట‌కలో మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. త‌న నియోజ‌కవ‌ర్గం ఇండి తాలూకా (Indi taluk)ను క‌ర‌వు ప్రాంతంగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ (Yashwanthrayagowda Patil) రాజీనామా చేశారు.

D

National | Published On Sep 23, 2026, 2.57 pm IST

Congress MLA | ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
Advertisement

Congress MLA | త్రినేత్ర న్యూస్ : క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో మ‌రోసారి రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే (Congress MLA) యశ్వంతరాయగౌడ పాటిల్ (Yashwanthrayagowda Patil) రాజీనామా చేశారు. విజ‌య‌పుర జిల్లా ప‌రిధిలోని త‌న నియోజ‌కవ‌ర్గం ఇండి తాలూకా (Indi taluk)ను క‌ర‌వు ప్రాంతంగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న రాజీనామా లేఖ‌ను ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌కు స‌మ‌ర్పించ‌డంతోపాటూ స్పీక‌ర్ కార్యాల‌యానికి కూడా పంపారు.

కాగా, య‌శ్వంత‌రాయ గౌడ.. సీఎంకు రాజీనామా లేఖ పంప‌డం ఇది రెండోసారి. గ‌త నెల‌లో కూడా ఆయ‌న రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. కేబినెట్ విస్త‌ర‌ణ (Karnataka Cabinet expansion) సంద‌ర్భంగా త‌న‌కు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, సీఎం బుజ్జ‌గింపుల త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. ఇప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను సాకుగా చూపి రాజీనామా చేయండం క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో తీవ్ర కల‌క‌లం రేపుతోంది.

Also Read..

భారీ అగ్నిప్ర‌మాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు

మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘ‌ట‌న‌.. విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్న లేడీ శ్రీ‌రామ్ క‌ళాశాల

స‌ర్‌పై ఈసీలో అంత‌ర్గ‌త విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణ‌యాల‌పై ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు అభ్యంతరాలు

Advertisement
Advertisement