త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mercedes Benz Cars | భారీ అగ్నిప్ర‌మాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు

Mercedes Benz Cars | రాజస్థాన్‌ (Rajasthan) జైపూర్‌ (Jaipur)లోని ఓ ల‌గ్జరీ కార్ల వ‌ర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో 8 బెంజ్ కార్లు కాలి బూడిద‌య్యాయి.

D

National | Published On Sep 23, 2026, 2.04 pm IST

Mercedes Benz Cars | భారీ అగ్నిప్ర‌మాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు
Advertisement

Mercedes Benz Cars | త్రినేత్ర న్యూస్ : రాజస్థాన్‌ (Rajasthan) జైపూర్‌ (Jaipur)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీతాపుర ప్రాంతంలోని సంగనేర్ సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోగ‌ల‌ బాలాజీ మార్కెట్‌ (Balaji Market)లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల‌ వర్క్‌షాప్‌ (Mercedes Benz Cars Workshop)లో మంగ‌ళ‌వారం రాత్రి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.

ప్ర‌మాద స‌మ‌యంలో వ‌ర్క్‌షాప్‌లో పాత‌వి, కొత్త‌వి క‌లిపి సుమారు 50కిపైగా కార్లు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 8 ల‌గ్జ‌రీ కార్లు, కార్ల విడిభాగాలు కాలి బూడిద‌య్యాయి. ప్ర‌మాద తీవ్ర‌త‌కు దాదాపు 5 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కూ ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు మరింత వ్యాపించకముందే వ‌ర్క్‌షాప్‌లోని ప‌లు కార్ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. దీంతో పెను న‌ష్టం త‌ప్పిన‌ట్లైంది. అదృష్ట‌వ‌శాత్తూ ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read..

మూడు ఐపీఓల లిస్టింగ్‌.. ఎవరి షేర్‌ ఎంత లాభం ఇచ్చిందంటే?

స‌ర్‌పై ఈసీలో అంత‌ర్గ‌త విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణ‌యాల‌పై ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు అభ్యంతరాలు

ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?

Advertisement

తాజావార్తలు

Advertisement