Hyderabad | హైదరాబాద్‌లో హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు
Hyderabad | హైదరాబాద్ నగరంలో 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందంటూ ఈమెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అప్రమత్తమయ్యారు.
Hyderabad | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరంలో 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందంటూ ఈమెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేయడంతో పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఈ బాంబు దాడిలో కనీసం 300 మందిని చంపేస్తామని మెయిల్‌లో బెదిరింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్టు ప్లాజాను టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఈమెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ రెండు ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లతో పాటు జన సమూహం ఉండే ప్రాంతాలపై పోలీసులు నిఘా పెంచారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLA Rajasingh | హైదరాబాద్‌లో ఉగ్రదాడి బెదిరింపు.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
నవంబర్ 23, 2026

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12.69 లక్షల మంది దరఖాస్తు
నవంబర్ 23, 2026

Hyderabad Bomb Threat Email | కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను బాంబులతో పేల్చేస్తాం
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●MLA Rajasingh | హైదరాబాద్‌లో ఉగ్రదాడి బెదిరింపు.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
- ●Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు
- ●Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
- ●Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12.69 లక్షల మంది దరఖాస్తు
- ●Horoscope | నవంబర్ 23 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

MLA Rajasingh | హైదరాబాద్‌లో ఉగ్రదాడి బెదిరింపు.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు

Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత



