Raviteja | క్లాస్ డైరెక్టర్‌తో రవితేజ హారర్ మూవీ – ఊహించని కాంబో సెట్
ఇరుముడితో కెరీర్‌లోనే పెద్ద హిట్టును అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ.ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ బ్యాక్ టూ బ్యాక్ కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాడు. బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం సినిమాల డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ ఓ హారర్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను శుక్రవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
Entertainment | Published On Aug 28, 2026, 7.16 pm IST
Raviteja | ఇరుముడితో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. తండ్రీకూతుళ్ల అనుబంధానికి భక్తి ఎలిమెంట్‌ను జోడించి రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ వీక్‌లోనే 125 కోట్లకుపైగా కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన రవితేజ హీరోగా మళ్లీ బిజీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు.
మల్టీస్టారర్...
ఇటీవలే హసిత్ గోలి డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పారు రవితేజ. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీవిష్ణు హీరోగా నటించబోతున్నాడు. సంక్రాంతికి ఈ మల్టీస్టారర్ థియేటర్లలోకి రాబోతుంది.
వివేక్ ఆత్రేయ...
ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం సినిమాల డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ మూవీ చేయబోతున్నాడు. శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
హారర్ జానర్‌లో...
హారర్ జానర్‌లో రవితేజ, వివేక్ ఆత్రేయ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. కెరీర్ ఆరంభంలో అన్వేషణ పేరుతో ఓ హారర్ మూవీ చేశారు. స్టార్ హీరోగా మారిన తర్వాత ఈ జానర్‌ను టచ్ చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత హారర్ కథతో సినిమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో క్లాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాతోనే తన స్టైల్‌ను మార్చబోతున్నట్లు సమాచారం.
దిల్‌రాజు బ్యానర్‌లో...
రవితేజ, వివేక్ ఆత్రేయ మూవీని బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీని నిర్మిస్తున్నారు. గతంలో దిల్‌రాజుతో కలిసి లక్ష్మణ్ పలు సినిమాలను నిర్మించారు. దిల్‌రాజు బ్యానర్ నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్ తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. హాసిత్ గోలి సినిమా పూర్తయిన తర్వాత ఈ హారర్ మూవీ సెట్స్‌పైకి రానున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి – మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
సెప్టెంబర్ 10, 2026

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
సెప్టెంబర్ 9, 2026

Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



