RS Praveen Kumar | కాంగ్రెస్ మంత్రులపై కూడా ఇలాగే దౌర్జన్యం చేస్తారా..?
RS Praveen Kumar | సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారుల తీరుపై కోదాడ ప్రధాన రహదారిపై బాధితులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.
డీజీపీ, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటీ ప్రశ్న
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారుల తీరుపై కోదాడ ప్రధాన రహదారిపై బాధితులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ధర్నాకు దిగిన బాధితుల పట్ల స్థానిక సీఐ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి గొంతు నొక్కుతూ నేలపై పడేసి చితకబాదారు. అంతేకాదు అడ్డుకోబోయిన మహిళల పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించి, వారిని కూడా నెట్టేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా దారుణమని మండిపడ్డారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించిన కాంగ్రెస్ మంత్రులపై కూడా ఇలాగే దౌర్జన్యం చేస్తారా మీ పోలీసులు అని తెలంగాణ డీజీపీ, సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మొన్న మహబూబాబాద్‌లో, నేడు కోదాడలో ఇక ఎన్నాళ్ళు పేదలపై ఈ దౌర్జన్యం? దాడులు? అని నిలదీశారు. ఇప్పటికే కోదాడలో ఒక ఎస్సీ యువకుడిని (కర్ల రాజేష్) లాకప్‌లో చంపారు. ఇంకా రక్త దాహం తీరలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ మునుగుతున్నదని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
నడిరోడ్డుపై సీఐ దాష్టీకం
దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు
మున్సిపల్… pic.twitter.com/8tohnBjgaG
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



