త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | రామాయ‌ణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – ధ‌రుంధ‌ర్ 2 , టాక్సిక్ కంటే త‌క్కువే!

రామాయ‌ణ మూవీ తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 155 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ ఏడాది హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన‌ ఇండియ‌న్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. అయితే మొద‌టిరోజు క‌లెక్ష‌న్స్ ప‌రంగా ధురంధ‌ర్ 2, టాక్సిక్ రికార్డుల‌ను మాత్రం రామాయ‌ణ బ్రేక్ చేయ‌లేక‌పోయింది.

N

Entertainment | Published On Nov 6, 2026, 2.48 pm IST

Ramayana | రామాయ‌ణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – ధ‌రుంధ‌ర్ 2 , టాక్సిక్ కంటే త‌క్కువే!
Advertisement

Ramayana |రామాయ‌ణ మూవీ తొలి రోజు మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. రామాయ‌ణలో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించారు. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రావ‌ణాసురుడి పాత్ర‌ను కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ పోషించారు.

155 కోట్ల వ‌సూళ్లు...

మొద‌టిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రామాయ‌ణ మూవీ 155 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇండియావైడ్‌గా 77 కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో యాభై కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. పెయిడ్ ప్రీమియ‌ర్ల‌తో క‌లిపి 150 కోట్ల మార్కును దాటిన‌ట్లు వెల్ల‌డించారు.

ఏడో స్థానంలో...

ఈ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఇండియ‌న్ సినిమాల్లో ఏడో స్థానంలో రామాయ‌ణ నిలిచింది. ఈ జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్‌లో 140 కోట్ల‌తో ధురంధ‌ర్ 2 ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా...119 కోట్ల‌తో టాక్సిక్ రెండో స్థానంలో ఉంది. రామాయ‌ణ తెలుగు వెర్ష‌న్‌కు మొద‌టి రోజు 8.15 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. య‌శ్‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా తెలుగుతో పోలిస్తే క‌న్న‌డ వెర్ష‌న్‌కు ఎక్కువ వ‌సూళ్ల‌ను సొంతంచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. రామాయ‌ణ క‌న్న‌డ వెర్ష‌న్ ఎనిమిదిన్న‌ర కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్ల‌తో అద‌ర‌గొట్టింది. తొలిరోజు క‌లెక్ష‌న్ల‌లో ధురంధ‌ర్ 2ను మాత్రం ఈ మూవీ బీట్ చేయ‌లేక‌పోయింది. దాదాపు రెండువేల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన రామాయ‌ణ మొద‌టిరోజు కేవ‌లం 155 కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్ట‌డంతో ఈ సినిమా బ్రేక్ అవుతుందా? లేదా? అన్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

వీఎఫ్ఎక్స్‌, విజువ‌ల్స్‌...

రామాయ‌ణ మూవీలో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, య‌శ్‌, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌, వీఎఫ్ఎక్స్‌, విజువ‌ల్స్ బాగున్నాయంటూ ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. లెంగ్త్ ఎక్కువ కావ‌డం, రాముడితో పోలిస్తే రావ‌ణాసురుడిని ఎక్కువ‌గా హైలైట్ చేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రామాయ‌ణ మూవీకి హ‌న్స్ జిమ్మ‌ర్‌తో క‌లిసి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించారు.

 

Advertisement
Advertisement