OMC Shares | పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా ఓఎంసీల షేర్లు భారీగా పతనం
OMC Shares | ముడి చమురు ధరలు భారీగా పెరిగి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు గత కొద్ది రోజులుగా తీవ్రమైన నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు స్వల్ప ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఒక్కొక్కటి రూ.3 చొప్పున పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
OMC Shares | ముడి చమురు ధరలు భారీగా పెరిగి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు గత కొద్ది రోజులుగా తీవ్రమైన నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు స్వల్ప ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఒక్కొక్కటి రూ.3 చొప్పున పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇంధన ధరలను పెంచినప్పటికీ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 ధర పెంపు ప్రకటించినా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) షేర్లు 2 శాతం కన్నా ఎక్కువగా క్షీణించి నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మూడింటిలో హెచ్‌పీసీఎల్ షేర్లు అత్యధికంగా పడిపోయాయి. గురువారం ముగింపు ధరతో పోలిస్తే ఇవి 2 శాతానికి పైగా క్షీణించాయి. బీపీసీఎల్ షేర్లు 1.7 శాతం తగ్గగా, ఐఓసీఎల్ సుమారు 1.3 శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది.
రోజుకు రూ.1వేయి కోట్ల నష్టం..
ఇరాన్‌తో అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి వాస్తవానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ సభ అనంతరం బంగారం, వెండి ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచగా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వాత పడింది. యుద్ధం కారణంగా ఓఎంసీలకు వచ్చిన భారీ నష్టాలను పూడ్చుకునేందుకు కేంద్రం ఈ పెంపును ప్రకటించినా అది కంటి తుడుపు చర్యేనని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రూ.1వేయి కోట్లకు పైగా నష్టాల్లో నడుస్తున్న కంపెనీలకు ఈ ఊరట ప్రయోజనం ఇవ్వదని అంటున్నారు. ఇప్పటికే ఓఎంసీలు రూ.1 లక్ష కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఊరట చాలా స్వల్పం..
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇటీవల చేసిన వ్యాఖ్యల ప్రకారం ఓఎంసీలు ఎఫ్‌వై27 తొలి త్రైమాసికంలో కలిపి రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.1.2 లక్షల కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాయి. అంటే రోజుకు రూ.1వేయి కోట్లకు పైగా నష్టం వస్తోందని అర్థం. అయితే లీటరుకు రూ.3 ధర పెంపు వల్ల ఈ కంపెనీలు రోజుకు కేవలం సుమారు రూ.125 కోట్ల నష్టాన్ని మాత్రమే తగ్గించుకోగలవని అంచనా. ఇది రోజువారీగా అంచనా వేస్తున్న రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల నష్టాలతో పోలిస్తే చాలా తక్కువ కావడం గమనార్హం. అందుకనే ఆయా కంపెనీల షేర్లు ఒత్తిడిలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..
జులై 6, 2026

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
జులై 4, 2026

IOCL Apprentice | ఐఓసీఎల్‌లో అప్రెంటిస్‌లు.. ఈ నెల 28 వరకు దరఖాస్తు గడువు
జులై 3, 2026
తాజావార్తలు
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం
- ●Vinod Kumar | భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్ చెప్పమన్నడా?
- ●Jana Nayagan | జన నాయగన్‌కు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు - 13 కట్స్ - రన్‌టైమ్ రివీల్ - అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?

LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!

Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Vinod Kumar | భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్ చెప్పమన్నడా?



