Bheem Reddy | సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఈడీ షాక్.. మనీలాండరింగ్ కేసు నమోదు
Bheem Reddy | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డికి (Bheem Reddy) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. ఆయనపై ఈడీ మనీలాండరింగ్ (Money Laundering) కేసు నమోదుచేసింది. పీఎంఎల్‌ఏ (PMLA) కింద దర్యాప్తు చేపట్టింది.
Bheem Reddy | త్రినేత్ర.న్యూస్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డికి (Bheem Reddy) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. ఆయనపై ఈడీ మనీలాండరింగ్ (Money Laundering) కేసు నమోదుచేసింది. పీఎంఎల్‌ఏ (PMLA) కింద దర్యాప్తు చేపట్టింది. భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఇప్పటికే ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమ్‌రెడ్డి ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. ఏసీబీ (ACB) నమోదుచేసిన కేసు ఆధారంగా విచారణ చేపట్టనుంది. అవినీతి ద్వారా వచ్చిన నగదును ఆస్తుల్లోకి మళ్లించారా? అనే అంశంపై ఈడీ ఆరా తీస్తుంది.
కాగా, మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, పటాన్‌చెరు, నాగోలు, మోమిన్‌పేట, జహీరాబాద్, బెంగళూరులో బీమ్‌రెడ్డికి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో అధికంగా బినామీల పేర్లతో ఉన్నట్లు సందేహం వ్యక్తమవుతుంది. భీమ్‌రెడ్డిపై ఇప్పటికే ఐటీ శాఖ కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం భీమ్‌రెడ్డికి, బినామీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన






