MP Chamala | సర్ పేరుతో శాశ్వత అధికారానికి బీజేపీ కుట్ర
MP Chamala | సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
- తొలగించిన ఓట్లపై సమాధానం చెప్పాలి..
- సీఈసీని జ్ఞానేశ్వర్‌ను తొలగించాలి
- మణిపూర్ అల్లర్లను పట్టించుకోరా?
- డబుల్ ఇంజిన్ పేరుతో వివక్ష తగదు
MP Chamala | సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశంలో తొలగించిన 13.30 కోట్ల ఓట్లలో మూడు కోట్ల మంది అక్రమ వలసదారుల ఓట్లు ఉన్నాయని అమిత్ షా చెబుతున్నారని, మరి 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేశారని చామల ప్రశ్నించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి ఎంతమంది దేశంలోకి వచ్చారు? ఎంతమంది విద్రోహ శక్తులు ప్రవేశించారు? దేశ అంతర్గత భద్రత పరిస్థితి ఏమిటని నిలదీశారు. హైదరాబాద్‌కు రావడం కంటే మణిపూర్‌కు వెళ్లి ఉంటే బాగుండేదని, అక్కడ అల్లర్లతో పరిస్థితులు అట్టుడుకుతున్నాయని అన్నారు.
మోదీ, అమిత్ షాలపై ఘాటు వ్యాఖ్యలు
గుజరాత్ నుంచి ఢిల్లీకి ఇద్దరు గుస్పతీలు వచ్చారని మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి విమర్శించారు. 2014 నుంచి వారి వల్ల దేశానికి దరిద్రం పట్టిందని వ్యాఖ్యానించారు. వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే హోంమంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. అమిత్ షా మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లా కాకుండా వాస్తవాలు మాట్లాడాలని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చేసిన డిమాండ్లను బీజేపీ నెరవేర్చాలని చామల కోరారు. ఈ నెలలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మూడు అంశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు విచారించాలని.. తొలగించిన ఓట్లను సరిచూసి అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది జంతర్‌మంతర్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తే కానీ కేంద్రానికి బుద్ధి రాలేదని విమర్శించారు.
డబుల్ ఇంజిన్ పేరుతో వివక్ష వద్దు
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే నిధులు ఇస్తామనే ఆలోచనను కేంద్రం విడనాడాలని హితవు పలికారు. గంగా, యమునా, సబర్మతి నదులనే అభివృద్ధి చేస్తారా? మిగతా రాష్ట్రాలను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కేరళ, తమిళనాడు, హర్యానాలో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓట్ల బదిలీతోనే బీజేపీకి ఎనిమిది ఎంపీ స్థానాలు వచ్చాయని ఆరోపించారు. తెలంగాణలో 50 శాతం పట్టణీకరణ సాధించాలంటే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు అవసరమని చామల పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు తమ పనులు పూర్తి చేసుకుని సకాలంలో ఇళ్లకు చేరుకోవాలంటే మెట్రో ఫేజ్-2 పనులు పూర్తికావాలన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sangishetti Jagadeeshwar Rao | అమిత్ షా సర్దుకునే టైమొచ్చింది: సంగిశెట్టి జగదీశ్వర్ రావు
- ●CM Devendra Fadnavis | ఆమె ప్రముఖ నటే కావొచ్చు.. బీఎంసీకి ఆ హక్కు ఉంది.. దియా మీర్జా వీడియో వివాదంపై మౌనం వీడిన సీఎం ఫడ్నవీస్
- ●NYTTA | తెలంగాణ సంస్కృతిని అమెరికాలోని భావితరాలకు తెలియజేయడమే లక్ష్యం
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు.. పెట్టుబడిదారులకు పండగే..
- ●KTR | మస్కట్ నుంచి స్వదేశానికి.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్
- ●Cisco | 27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..

Sangishetti Jagadeeshwar Rao | అమిత్ షా సర్దుకునే టైమొచ్చింది: సంగిశెట్టి జగదీశ్వర్ రావు

CM Devendra Fadnavis | ఆమె ప్రముఖ నటే కావొచ్చు.. బీఎంసీకి ఆ హక్కు ఉంది.. దియా మీర్జా వీడియో వివాదంపై మౌనం వీడిన సీఎం ఫడ్నవీస్

NYTTA | తెలంగాణ సంస్కృతిని అమెరికాలోని భావితరాలకు తెలియజేయడమే లక్ష్యం

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు.. పెట్టుబడిదారులకు పండగే..






