త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | మోదీజీ.. చర్చకు రండి! భయమెందుకు..? మరోసారి ప్రధానికి రాహుల్‌ సవాల్‌

Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్‌ విసిరారు. చర్చకు వేదిక, సమయం మీరే నిర్ణయించండి.. మీడియా, దేశ యువత సమక్షంలో చర్చిద్దామని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

P

National | Published On Nov 3, 2026, 8.18 pm IST

Rahul Gandhi | మోదీజీ.. చర్చకు రండి! భయమెందుకు..? మరోసారి ప్రధానికి రాహుల్‌ సవాల్‌
Advertisement

Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్‌ విసిరారు. చర్చకు వేదిక, సమయం మీరే నిర్ణయించండి.. మీడియా, దేశ యువత సమక్షంలో చర్చిద్దామని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. న్యాయనిర్ణేతగా ఎవరిని నియమించాలనుకున్నా తనకు అభ్యంతరం లేదని, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను కూడా పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘మోదీజీ.. సవాల్‌ విసిరి 24 గంటలైంది. ప్రతిపక్షం దేశద్రోహి అని ఆరోపిస్తున్నారు. ఏ వేదికపైనైనా చర్చకు రండి. దేశద్రోహి ఎవరు? విదేశీ శక్తులతో సంబంధాలు ఎవరికి ఉన్నాయి? ఎలాంటి సంబంధాలున్నాయి? త్వరగా రండి.. భయపడకండి’ అంటూ రాహుల్‌ పోస్టు చేశారు.

అమెరికా ఒప్పందం.. అదానీ కేసుపై ప్రశ్నలు

బహిరంగ చర్చలో దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నిర్మాణం, అమెరికాతో ఒప్పందం, అదానీ కేసు, ఎప్‌స్టీన్‌ వ్యవహారాలను ప్రస్తావిస్తానని రాహుల్‌ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం ఎందుకు అంత హడావుడిగా చేశారు? ప్రధాని ఒక్కరే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? కేబినెట్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అదానీ కేసు ఎందుకు మూసివేశారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న ప్రధాని బహిరంగ చర్చకు రావాలని రాహుల్‌ కోరారు. తనపై ఇప్పటికే సుమారు 45 పరువునష్టం కేసులున్నాయని, విదేశీ సంబంధాలపై తాను లేవనెత్తిన అంశాలపైనా కేసు వేయాలని సవాల్‌ చేశారు. చర్చలో అన్ని విషయాలూ బహిరంగంగా తేలిపోతాయని పేర్కొన్నారు. చివరగా మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

24 గంటలకు ముందు..

ఇంత‌కు ముందురోజు కూడా మోదీపై రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ మద్దతుతోనే మోదీ ప్రధాని అయ్యారని, ఇప్పటికీ అదే మద్దతుతో కొనసాగుతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ శక్తుల ప్రభావం ఉందని, విదేశీ సోషల్‌ మీడియా కూడా మోదీకి మద్దతుగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ అంశాలపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. తాజాగా మ‌రోసారి రాహుల్ స‌వాల్ విసురుతూనే విమ‌ర్శ‌లు గుప్పించారు.

ట్యాగ్స్:

Adani CaseForeign Influence AllegationsMohan BhagwatNarendra ModiOpen Debate ChallengeRahul GandhiRahul Gandhi Vs PM ModiTelugu News
Advertisement
Advertisement