త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్

ముంబైలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు మూడు రోజుల బంద్‌కు దిగారు. మరాఠీ తప్పనిసరిగా మాట్లాడాలనే నిబంధనపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

J

National | Published On Aug 24, 2026, 2.00 pm IST

Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్
Advertisement
  • ముంబై నగరంలో మూడు రోజుల పాటు ఆటోలు, ట్యాక్సీల సమ్మె
  • డ్రైవర్లు విధిగా మరాఠీ భాష మాట్లాడాలనే నిబంధనకు వ్యతిరేకంగా నిరసన
  • మరాఠీ సరిగ్గా రాకపోతే రూ.15,000 నుంచి రూ.20,000 వరకు భారీ జరిమానాలు
  • 60 ఏళ్ల వయసులో కొత్త భాష ఎలా నేర్చుకోగలమని డ్రైవర్ల ఆవేదన

Marathi Language Rule Mumbai | త్రినేత్ర.న్యూస్ : ముంబై (Mumbai) నగరంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. డ్రైవర్లంతా తప్పనిసరిగా మరాఠీ (Marathi language) మాట్లాడాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనకు వ్యతిరేకంగా వారు మూడు రోజుల పాటు భారీ సమ్మెకు (Strike) దిగారు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు.

60 ఏళ్ల వయసులో స్కూల్‌కు వెళ్లాలా?

మరాఠీ రాకపోతే అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "మాకు 55 నుంచి 60 ఏళ్ల వయసు ఉంటుంది. మేము ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లలేదు. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా మరాఠీ ఎలా మాట్లాడగలం? మేమే కనుక చదువుకుని ఉంటే, ఏదైనా ఆఫీసులో జాబ్ చేసుకునేవాళ్లం కదా?" అంటూ ఒక ఆటో డ్రైవర్ తన బాధను పంచుకున్నారు.

వచ్చీరాని మరాఠీ మాట్లాడినా ఫైన్లు వడ్డిస్తున్నారు

ఏదోలా వచ్చీరాని మరాఠీ (broken Marathi) మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా అధికారులు కనికరించడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. మరాఠీ స్పష్టంగా రానందుకు ఏకంగా రూ.15,000 నుంచి రూ.20,000 వరకు జరిమానాలు (Penalties) విధిస్తున్నారని వారు మండిపడుతున్నారు. రోజువారీ కిరాయిలతో బతికే తాము, అంత పెద్ద మొత్తంలో ఫైన్ కట్టడం సాధ్యం కాదంటున్నారు.

న్యాయం జరిగే వరకు తగ్గేదేలే..

తమకు న్యాయం జరిగే వరకు ఈ మూడు రోజుల బంద్‌ను కొనసాగిస్తామని డ్రైవర్లు స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో కొత్త భాష నేర్చుకోవడం ఎవరికైనా సాధ్యమా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి డ్రైవర్ల ఆందోళనపై మహారాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement
Advertisement