LPG Cylinder Price | గ్యాస్ బండ.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర..
LPG Cylinder Price | ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. నెల మారింది. ఒకటో తారీఖు వచ్చింది. గ్యాస్ బండ (LPG Cylinder Price) మరింత భారమైంది. ఇప్పటికే పెరిగిన ధరతో సతమవుతున్న చిరు వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది.
LPG Cylinder Price | త్రినేత్ర.న్యూస్: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. నెల మారింది. ఒకటో తారీఖు వచ్చింది. గ్యాస్ బండ (LPG Cylinder Price) మరింత భారమైంది. ఇప్పటికే పెరిగిన ధరతో సతమవుతున్న చిరు వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను (Commercial LPG Cylinder) భారీగా పెంచింది. ఏకంగా రూ.993 వడ్డించింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
దీంతో ఢిల్లీలో రూ.3,071.50కి చేరుకుంది. ఇప్పటివరకు ఇది రూ.2078.50గా ఉంది. ఇక కోల్‌కతాలో రూ.3202, ముంబైలో రూ.3024, చెన్నైలో రూ.3237గా ఉన్నది. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.196 పెరిగిన విషయం తెలిసింది. ఇక మార్చిలో రూ.114.50 పెరిగింది. ఇక మార్చిలో రూ.114.50 పెరిగింది. ఇక హైదరాబాద్‌లో రూ.3,315కు చేరింది.
కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల సిలిండర్ ధర (Domestic LPG) పెరగకపోవడం వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చేదే. డొమెస్టిక్ సిలిండర్ ప్రస్తుతం రూ.965గా ఉన్నది. గత నెల రూ.60 పెరిగిన విషయం తెలిసిందే.
వాణిజ్య సిలిండర్ ధరల పెరుగుదల ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, మధ్యప్రాచ్యంలో (వెస్ట్ ఏషియా) జరుగుతున్న సంఘర్షణలు, హార్మూజ్ స్ట్రెయిట్‌లో సరఫరా సమస్యల వల్ల సంభవించింది. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు, క్యాటరింగ్ సర్వీసెస్ వంటి వాణిజ్య వినియోగదారులపై భారీ ప్రభావం చూపుతుంది.
Breaking : Commercial 19kg LPG cylinder prices increased by Rs 993 .
Now the commercial LPC cylinder will cost 3071 Rs in Delhi.
Earlier it was Rs 2078
New Rate Applicable from 1st May. pic.twitter.com/wfvmnZss2u
— Aseem Manchanda (@aseemmanchanda) May 1, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






