Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
Gas Cylinder Price | గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. నెల మారడంతో సిలిండర్ ధరను (Gas Cylinder Price) పెంచేశాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై (Commercial LPG Cylinder) ఏకంగా రూ.62.50 భారం మోపాయి.
Gas Cylinder Price | త్రినేత్ర న్యూస్: గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. నెల మారడంతో సిలిండర్ ధరను (Gas Cylinder Price) పెంచేశాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై (Commercial LPG Cylinder) ఏకంగా రూ.62.50 భారం మోపాయి. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,810కి చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. సెప్టెంబర్‌లో కూడా కమర్షియల్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగిన విషయం తెలిసిందే. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది.

తాజా పెంపుతో కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,810 (రూ.62.50), ముంబైలో రూ.2,764 (రూ.63), చెన్నైలో రూ.2,983 (రూ.66.50), హైదరాబాద్‌లో రూ.3,065 (రూ.69)కు, కోల్‌కతాలో రూ.2,946.50కి చేరింది. కాగా, ఈనెలలో కూడా 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ (Domestic LPG prices) ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.994గా ఉండగా.. ఢిల్లీలో రూ.942, ముంబై రూ.941.50, చెన్నై రూ.957.50, కోల్‌కత్తాలో రూ.968గా ఉంది.
The price of a 14.2-kg domestic LPG cylinder has been increased by Rs 29. In Delhi, 14.2-Kg Domestic LPG Cylinder prices increased from Rs 913 to Rs 942. New rate will be effective from June 7.
— ANI (@ANI) June 6, 2026
తాజావార్తలు
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..
- ●Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!
- ●Moody's India Aging Report | ధనిక దేశం కాకముందే వృద్ధ భారత్: వేగంగా పడిపోతున్న జననాల రేటు..!
- ●Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!
- ●Singireddy Niranjan Reddy | సిరిసిల్లలో రేవంత్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద : హంతకుడే సంతాపం తెలిపినట్లుంది

University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..

Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!

Moody's India Aging Report | ధనిక దేశం కాకముందే వృద్ధ భారత్: వేగంగా పడిపోతున్న జననాల రేటు..!






