త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Richest Chief Ministers in India | దేశంలో టాప్ 10 ధనిక సీఎంలు వీరే: చంద్రబాబు, రేవంత్ రెడ్డి ర్యాంకులు ఎంతంటే?

భారత్‌లో అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితా వచ్చేసింది. రూ.1413 కోట్లతో డీకే శివకుమార్ మొదటి స్థానంలో నిలిచారు. చంద్రబాబు, రేవంత్ ఆస్తుల వివరాలు చూద్దాం రండి.

J

National | Published On Jun 4, 2026, 10.00 pm IST

Richest Chief Ministers in India | దేశంలో టాప్ 10 ధనిక సీఎంలు వీరే: చంద్రబాబు, రేవంత్ రెడ్డి ర్యాంకులు ఎంతంటే?
Advertisement
  • మైనేత (Myneta) డేటా ఆధారంగా దేశంలోని టాప్ 10 ధనిక సీఎంల జాబితా విడుదల
  • రూ.1,413 కోట్ల ఆస్తులతో కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్ తొలి స్థానంలో
  • రూ. 931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.30 కోట్ల ఆస్తులతో తొమ్మిదో స్థానం 

Richest Chief Ministers in India | త్రినేత్ర.న్యూస్ : భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయనే ఆసక్తి సామాన్య ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. తాజాగా ఎన్నికల అఫిడవిట్లలో వారు స్వయంగా ప్రకటించిన ఆస్తుల (Latest disclosed assets) ఆధారంగా దేశంలో టాప్ 10 అత్యంత ధనిక ముఖ్యమంత్రుల (Richest Chief Ministers) జాబితా తెరపైకి వచ్చింది. ట్రేడ్ బ్రెయిన్స్ (Trade Brains), మైనేత (Myneta) సంస్థల నివేదిక ప్రకారం వెల్లడైన ఈ జాబితాలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

టాప్ ప్లేస్‌లో డీకే.. ఆ తర్వాతే చంద్రబాబు

ఈ జాబితాలో కర్ణాటకకు చెందిన సీనియర్ నేత, కొత్త సీఎం డీకే శివకుమార్ (D. K. Shivakumar) ఏకంగా రూ. 1,413 కోట్ల ఆస్తులతో ఏకగ్రీవంగా మొదటి స్థానంలో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా, ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, కొత్త సీఎం సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) రూ. 648 కోట్లతో మూడవ స్థానంలో నిలవడం విశేషం.

నిజానికి నిన్నటి వరకు రిచెస్ట్ సీఎం అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి స్థానంలో ఉన్నారు. కానీ.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో ఏపీ సీఎంను వెనక్కి నెట్టి డీకే తొలి స్థానంలో నిలిచారు.

తెలంగాణ సీఎం రేవంత్ ర్యాంక్ ఎంతంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 30 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో తొమ్మిదో ర్యాంకులో ఉన్నారు. అలాగే, రూ. 332 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు నాలుగో స్థానంలో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూ. 35 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు.

టాప్ 10 ధనిక ముఖ్యమంత్రుల జాబితా ఇదే

Advertisement

తాజావార్తలు

Advertisement