CM Vijay | అలాంటివారికి రెండో ఛాన్స్ ఉండదు.. మంత్రులకు సీఎం విజయ్ కీలక హెచ్చరికలు
CM Vijay | తన కేబినెట్ మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు వస్తే మంత్రులను వెంటనే తమ పదవుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
CM Vijay | అవినీతి (corruption) విషయంలో తన మంత్రులకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) కీలక హెచ్చరికలు చేశారు. అవినీతి ఆరోపణలు వస్తే మంత్రులను వెంటనే తమ పదవుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. చెన్నైలోని (Chennai) సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల పనితీరు, పారదర్శకత, అవినీతి నివారణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మంత్రులు లేదా వారి శాఖలకు సంబంధించి అవినీతి, లంచాలు, అక్రమాలపై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోపణలు రుజువైతే ఇక ఏమాత్రం ఆలోచించకుండా సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోమని సీఎం గట్టిగా హెచ్చరించారు.
అవినీతి రహిత పాలన అందించేందుకు మంత్రులు కట్టుబడి ఉండాలన్నారు. అధికారులు చేసే పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదని సూచించారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పు జరిగినా తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, అవినీతి నిర్మూలన కోసం విజయ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తక్షణమే ఫిర్యాదు చేసేలా వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లంచం అడగడం, ఇవ్వడం రెండూ నేరమేనని తెలియజేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా రెండు భాషల్లో నోటీసు బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Also Read..
హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి.. టీ పీసీసీ చీఫ్‌కు మహిళా జేఏసీ విజ్ఞప్తి
స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..
సంబంధిత వార్తలు

Tasmac Cooling Charge Scam | రూ.160 బీరుకు రూ.170.. సీఎం విజయ్‌కు యువకుడి ఫిర్యాదు.. VIDEO
జులై 15, 2026

Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు – టీవీకే పార్టీ ప్రత్యర్థి నిర్మాత – కోలీవుడ్‌లో కొత్త రూమర్?
జులై 14, 2026

Supreme Court | గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం
జులై 13, 2026
తాజావార్తలు
- ●Woman Reservations | చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి.. టీ పీసీసీ చీఫ్‌కు మహిళా జేఏసీ విజ్ఞప్తి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..
- ●Bhatti Vikramarka | గోదావరి జలాల వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ
- ●Mega Job Mela | జూలై 21న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
- ●NPS | ఎన్పీఎస్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ఆర్డీఏ కొత్త టూల్.. కార్పస్ ఎంత అవుతుందో ఈజీగా లెక్కించవచ్చు..
- ●Vaakiti Srihari | కాంగ్రెస్ అంటేనే పని చేసే పార్టీ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల ముఖాముఖీ

Woman Reservations | చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి.. టీ పీసీసీ చీఫ్‌కు మహిళా జేఏసీ విజ్ఞప్తి

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

Bhatti Vikramarka | గోదావరి జలాల వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ

Mega Job Mela | జూలై 21న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా



