త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jason Sanjay | హీరోగా ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు – టీవీకే పార్టీ ప్ర‌త్య‌ర్థి నిర్మాత – కోలీవుడ్‌లో కొత్త రూమ‌ర్‌?

తండ్రి బాట‌లోనే అడుగులు వేయ‌బోతున్నాడు ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్‌. హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. జాస‌న్ సంజ‌య్ డెబ్యూ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ చేతిలోనే ఓడిపోయిన జీకే త‌మిళ కుమ‌ర‌న్ ప్రొడ్యూస‌ర్‌గా ఈ సినిమా రాబోతుంది.

N

Entertainment | Published On Jul 14, 2026, 4.23 pm IST

Jason Sanjay | హీరోగా ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు –  టీవీకే  పార్టీ ప్ర‌త్య‌ర్థి నిర్మాత – కోలీవుడ్‌లో కొత్త రూమ‌ర్‌?
Advertisement

Jason Sanjay |  త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ సిగ్మా మూవీతో ద‌ర్శ‌కుడిగా కోలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ జూలై 31న రిలీజ్ కాబోతుంది. జ‌న‌నాయ‌గ‌న్ జూలై 24న విడుద‌ల‌ కానుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో జాస‌న్ సంజ‌య్ డెబ్యూ మూవీ వాయిదాప‌డే అవ‌కాశం ఉందంటూ వార్త‌లొస్తున్నాయి.

హీరోగా...

జాస‌న్ సంజ‌య్ నెక్స్ట్ మూవీ ఎవ‌రితో అన్న‌దికోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. సిగ్మా రిలీజ్ కాక‌ముందే ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యు డి త‌దుప‌రి సినిమా కూడా ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. అయితే డైరెక్ట‌ర్‌గా కాకుండా ఈ సినిమాలో జాస‌న్ సంజ‌య్ హీరోగా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జాస‌న్ సంజ‌య్ హీరో డెబ్యూ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లైన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఈ సినిమాకు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో పాటు కార్తీక్ సుబ్బ‌రాజు, పా రంజిత్‌ల‌లో ఒక‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

టీవీకే పార్టీ చేతిలో ఓడిన నాయ‌కుడు....

జాస‌న్ సంజ‌య్ హీరో డెబ్యూ మూవీకి జీకే త‌మిళ కుమ‌ర‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కుమ‌ర‌న్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోకారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాలైన నాయ‌కుడి బ్యాన‌ర్‌లో జాస‌న్ సంజ‌య్ సినిమా చేయ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌రిమ‌ళ అండ్ కో...

ఇటీవ‌ల రిలీజైన త‌మిళ మూవీ ప‌రిమ‌ళ అండ్ కో సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు జీకే త‌మిళ కుమ‌ర‌న్‌. అయ్యా, ఎండ్రేండ్రుం పున్నాగైతో పాటు త‌మిళంలో మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించారు. అంతే కాకుండా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు హెడ్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే జాస‌న్ సంజ‌య్ డెబ్యూ మూవీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌.

సందీప్ కిష‌న్ హీరో...

జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సిగ్మా మూవీలో సందీప్ కిష‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ పాట‌లో సంజ‌య్ సంజ‌య్ గెస్ట్‌గా న‌టించాడు.

 

Advertisement
Advertisement