NPS | ఎన్‌పీఎస్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. పీఎఫ్‌ఆర్డీఏ కొత్త టూల్.. కార్పస్ ఎంత అవుతుందో ఈజీగా లెక్కించవచ్చు..
NPS | పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) ఎన్‌పీఎస్ ప్రైడ్ (NPS PRIDE) దిశా (DISHA) పేరుతో కొత్త డిజిటల్ కంపారిజన్, డెసిషన్ సపోర్ట్ టూల్‌ను ప్రారంభించింది.
NPS | పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) ఎన్‌పీఎస్ ప్రైడ్ (NPS PRIDE) దిశా (DISHA) పేరుతో కొత్త డిజిటల్ కంపారిజన్, డెసిషన్ సపోర్ట్ టూల్‌ను ప్రారంభించింది. ఈ టూల్ ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) సబ్‌స్క్రైబర్లు వివిధ పెన్షన్ ఫండ్‌లు, స్కీమ్‌ల చారిత్రక పనితీరును పోల్చి చూసి మెరుగైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్‌లో ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు లేదా పదేళ్ల పాయింట్-టు-పాయింట్ రిటర్న్స్ ఆధారంగా మాత్రమే స్కీమ్‌ల పనితీరును అంచనా వేసేవారు. అయితే కొత్త ఎన్‌పీఎస్ ప్రైడ్-దిశా టూల్ రోజువారీ నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) డేటాను ఉపయోగించి ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్‌ఐఆర్‌ఆర్) విధానంతో పెట్టుబడి ఫలితాలను లెక్కిస్తుంది. దీంతో క్రమం తప్పకుండా ప్రతి నెలా పెట్టుబడి చేసే సబ్‌స్క్రైబర్లకు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండే రిటర్న్స్‌ను అంచనా వేయడం సాధ్యమవుతుంది.
సమాచారం ఆధారంగా నిర్ణయం..
ఈ టూల్ ద్వారా వినియోగదారులు ఎంచుకున్న కాలంలో ప్రతి నెలా చేసిన పెట్టుబడులు వివిధ పెన్షన్ ఫండ్‌లలో ఎంతగా పెరిగి ఉండేవో విశ్లేషించుకోవచ్చు. దీంతో రిటైర్మెంట్ ప్లానింగ్‌కు గాను మరింత సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది. పెన్షన్ ఫండ్‌ల పనితీరులో పారదర్శకతను పెంచడం, వివిధ పెన్షన్ స్కీమ్‌లను సులభంగా పోల్చుకునే అవకాశం కల్పించడం, దీర్ఘకాలిక రిటైర్మెంట్ సంపద సృష్టిపై అవగాహన పెంచడం, డేటా ఆధారిత పెట్టుబడి నిర్ణయాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కాలిక్యులేటర్‌ను రూపొందించినట్లు పీఎఫ్‌ఆర్డీఏ తెలిపింది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు ఈక్విటీ (ఈ), కార్పొరేట్ బాండ్స్ (సీ), గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ) వంటి వ్యక్తిగత స్కీమ్‌ల పాయింట్-టు-పాయింట్ రిటర్న్స్ ఆధారంగా మాత్రమే పెన్షన్ ఫండ్‌ల పనితీరును అంచనా వేసేవారు. కానీ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి చేసే వారికి ఆ గణాంకాలు వాస్తవ పెట్టుబడి అనుభవాన్ని పూర్తిగా ప్రతిబింబించవని పీఎఫ్‌ఆర్డీఏ పేర్కొంది.
2008 నుంచి డేటా..
సబ్‌స్క్రైబర్లు సాధారణంగా వివిధ అసెట్ క్లాస్‌లలో నిర్ణీత నిష్పత్తిలో పెట్టుబడి పెడుతుంటారు. అందుకే కాలానుగుణ పెట్టుబడులపై రాబడిని ఎక్స్‌ఐఆర్‌ఆర్ పద్ధతిలో లెక్కించే కొత్త ప్లాట్‌ఫామ్‌ను నియంత్రణ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వాస్తవ చారిత్రక పనితీరు ఆధారంగా ఏ పెన్షన్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ కార్పస్ ఎంతగా పెరిగి ఉండేదో పోల్చి చూడవచ్చు. 2008 నుంచి సేకరించిన స్కీమ్‌ల వారీ చారిత్రక ఎన్‌ఏవీ డేటాతో ఈ ప్లాట్‌ఫామ్ ను రూపొందించారు. ఇందులో సుమారు 5వేల రోజుల రోజువారీ ఎన్‌ఏవీ సమాచారం అందుబాటులో ఉంది. ప్రస్తుతం 1.10 లక్షలకు పైగా ఎన్‌ఏవీ డేటా పాయింట్ల ఆధారంగా దాదాపు 4,800 పెట్టుబడి కాంబినేషన్‌లను ఈ ప్లాట్‌ఫామ్ విశ్లేషించగలుగుతుందని పీఎఫ్‌ఆర్డీఏ తెలిపింది. ఈ టూల్ ద్వారా మార్కెట్‌లోని అన్ని అర్హత కలిగిన పెన్షన్ ఫండ్‌ల పనితీరును ఒకేచోట పోల్చి చూడవచ్చు. బార్ చార్ట్‌ల రూపంలో కార్పస్ వృద్ధి, రిటర్న్స్ మధ్య తేడాలను స్పష్టంగా చూపిస్తుంది. వాస్తవ నగదు ప్రవాహాల సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్స్‌ఐఆర్‌ఆర్ ఆధారంగా వార్షిక రాబడులను లెక్కిస్తుంది.
ఎలా ఉపయోగించాలి..
అలాగే పెట్టిన పెట్టుబడులు, ఎన్‌ఏవీ వృద్ధి, కాంపౌండింగ్ ప్రభావాన్ని ఆధారంగా తీసుకుని మెచ్యూరిటీ సమయానికి ఎంత మొత్తం కార్పస్ ఏర్పడుతుందో చూపిస్తుంది. యాక్టివ్ ఛాయిస్, ఆటో ఛాయిస్, కాంపోజిట్ స్కీమ్ వంటి ఎన్‌పీఎస్ పెట్టుబడి ఎంపికలను కూడా ఒకదానితో మరొకటి సులభంగా పోల్చి చూసే అవకాశం కల్పిస్తుంది. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు పీఎఫ్‌ఆర్డీఏ వెబ్‌సైట్‌లోని ప్రైడ్ పోర్టల్ ద్వారా ఈ టూల్‌ను ఉపయోగించవచ్చు. వినియోగదారులు తమ పుట్టిన నెల, సంవత్సరం, పెట్టుబడి ప్రారంభించిన తేదీ, ప్రతి నెలా పెట్టే పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయాలి. అనంతరం గరిష్టంగా రెండు స్కీమ్‌లను ఎంపిక చేసుకుని యాక్టివ్ ఛాయిస్, ఆటో ఛాయిస్ లేదా లైఫ్ సైకిల్ ఆప్షన్‌ల మధ్య పోలికను చూసి, చారిత్రక పనితీరు ఆధారంగా తమ రిటైర్మెంట్ కార్పస్ ఎంతగా పెరిగి ఉండేదో తెలుసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Retirement Planning | రిటైర్మెంట్ ఆదాయానికి ఏది బెస్ట్? డివిడెండ్ షేర్లా.. ఎస్డబ్ల్యూపీలా?
జులై 4, 2026

NPS | దీర్ఘకాలంలో ఎన్‌పీఎస్ బెస్ట్.. రికవర్ అవుతున్న మార్కెట్లు.. ఇదే సరైన సమయమా..?
జూన్ 27, 2026

LIC | ఎల్ఐసీలో ఈ పథకంలో చేరండి.. రిటైర్ అయ్యాక నెలకు రూ.21వేలు పెన్షన్ వస్తుంది..
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●DGMA | హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- ●Minister Konda Surekha | వర్షాలు సమృద్ధిగా కురవాలి.. గోల్కొండలో ఆకాంక్షించిన మంత్రి కొండా సురేఖ
- ●realme C100x | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన రియల్‌మి సి100ఎక్స్ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే..
- ●Meenakshi Natarajan | ఇక పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిషేధం.. జేసీబీలతో దండలు వేయొద్దు..
- ●Nayanthara | కాజల్, తమన్నా బాటలో నయన్ - మెగా హీరో మూవీలో లేడీ సూపర్ స్టార్
- ●Anganwadi centres | అంగన్వాడీ కేంద్రాలకు వెలుగులు.. మంత్రి సీతక్క చొరవతో ఉచిత విద్యుత్

DGMA | హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

Minister Konda Surekha | వర్షాలు సమృద్ధిగా కురవాలి.. గోల్కొండలో ఆకాంక్షించిన మంత్రి కొండా సురేఖ

realme C100x | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన రియల్‌మి సి100ఎక్స్ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే..

Meenakshi Natarajan | ఇక పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిషేధం.. జేసీబీలతో దండలు వేయొద్దు..



