త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mega Job Mela | జూలై 21న హైద‌రాబాద్‌లో మెగా జాబ్ మేళా

Mega Job Mela | నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌. ఈ నెల 21న హైద‌రాబాద్ న‌గ‌రంలో మెగా జాబ్ మేళా( Mega Job Mela )నిర్వ‌హించ‌నున్నారు. మెహిదీప‌ట్నం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్ల‌ర్ 67 స‌మీపంలోని కింగ్స్ ప్యాలెస్ ఈ జాబ్ మేళాకు వేదిక కానుంది.

S

Hyderabad | Published On Jul 16, 2026, 3.52 pm IST

Mega Job Mela | జూలై 21న హైద‌రాబాద్‌లో మెగా జాబ్ మేళా
Advertisement

Mega Job Mela | త్రినేత్ర‌.న్యూస్ : నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌. ఈ నెల 21న హైద‌రాబాద్ న‌గ‌రంలో మెగా జాబ్ మేళా( Mega Job Mela )నిర్వ‌హించ‌నున్నారు. మెహిదీప‌ట్నం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్ల‌ర్ 67 స‌మీపంలోని కింగ్స్ ప్యాలెస్ ఈ జాబ్ మేళాకు వేదిక కానుంది.

జాబ్ మేళా నిర్వాహ‌కుడు మ‌న్న‌న్ ఖాన్ మాట్లాడుతూ.. ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎడ్యుకేష‌న్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌లు కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

జాబ్ మేళాకు హాజ‌ర‌య్యే నిరుద్యోగ అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా ప‌దో త‌ర‌గ‌తి పాసై ఉండాలి. ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌తో హాజ‌రు కావాల్సి ఉంటుంది. అవ‌స‌ర‌మైతే ఇంట‌ర్వ్యూలు కూడా నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. త‌దిత‌ర వివరాల కోసం 8374315052 నంబ‌ర్‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement