Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..
Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు మార్పులేకుండా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ కేవలం 1 పాయింట్ లాభంతో 77,186.87 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు స్వల్పంగా పడిపోయి 24,072.75 వద్ద స్థిరపడింది.
Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు మార్పులేకుండా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ కేవలం 1 పాయింట్ లాభంతో 77,186.87 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు స్వల్పంగా పడిపోయి 24,072.75 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ప్రధాన సూచీల కన్నా ఎక్కువ బలహీనతను కనబరిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.41 శాతం క్షీణించగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.10 శాతం నష్టంతో ముగిసింది. ట్రేడింగ్‌లో ఎక్కువ సమయం ప్రధాన సూచీలు లాభాల్లోనే కొనసాగినప్పటికీ, రెండో అర్ధభాగంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ దిగివచ్చింది.
స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ షేర్లలో నమోదైన లాభాలు మార్కెట్‌కు మద్దతు ఇచ్చినా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వచ్చిన నష్టాలు వాటిని సమతుల్యం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రతికూల ధోరణి కొనసాగింది. సెన్సెక్స్ ముగిసే సమయానికి బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 40, జర్మనీకి చెందిన డీఏఎక్స్ సూచీలు 0.50 శాతం వరకు నష్టాల్లో ట్రేడయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85 డాలర్ల సమీపంలో కొనసాగుతూ స్వల్పంగా తగ్గింది. మరోవైపు, భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 11 పైసలు బలహీనపడి 96.36 వద్ద ముగిసింది.
పెట్టుబడిదారులకు అలర్ట్..
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఏర్పడుతున్న పరిణామాలను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధానికి సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయని, పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేముందు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్కెట్లకు వచ్చే వారం సెషన్ ఎంతో కీలకం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

NSE | ఎన్‌ఎస్‌ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..
జులై 16, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..
జులై 16, 2026

Stock Markets | స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మొదలైన అమ్మకాల ఒత్తిడి..
జులై 15, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | గోదావరి జలాల వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ
- ●Mega Job Mela | జూలై 21న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
- ●NPS | ఎన్పీఎస్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ఆర్డీఏ కొత్త టూల్.. కార్పస్ ఎంత అవుతుందో ఈజీగా లెక్కించవచ్చు..
- ●Vaakiti Srihari | కాంగ్రెస్ అంటేనే పని చేసే పార్టీ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల ముఖాముఖీ
- ●Ponguleti Srinivas Reddy | కావాలనే సీతారామ ప్రాజెక్ట్‌ను గాలికి వదిలేశారు.. మండిపడ్డ మంత్రి పొంగులేటి
- ●DGMA | హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

Bhatti Vikramarka | గోదావరి జలాల వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ

Mega Job Mela | జూలై 21న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా

NPS | ఎన్పీఎస్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ఆర్డీఏ కొత్త టూల్.. కార్పస్ ఎంత అవుతుందో ఈజీగా లెక్కించవచ్చు..

Vaakiti Srihari | కాంగ్రెస్ అంటేనే పని చేసే పార్టీ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల ముఖాముఖీ



