త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaakiti Srihari | కాంగ్రెస్ అంటేనే ప‌ని చేసే పార్టీ.. ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కారం కోస‌మే మంత్రుల ముఖాముఖీ

Vaakiti Srihari | కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని.. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గాంధీభవన్‌లో మంత్రులతో 'ముఖాముఖి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌ని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా తీసుకుని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 16, 2026, 3.47 pm IST

Vaakiti Srihari | కాంగ్రెస్ అంటేనే ప‌ని చేసే పార్టీ.. ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కారం కోస‌మే మంత్రుల ముఖాముఖీ
Advertisement
  • విన‌తులు స్వీక‌రించి.. ఆ వెంట‌నే అధికారుల‌కు ఆదేశాలిస్తున్నం
  • గాంధీభవన్ ముఖాముఖీ వినతుల స్వీకర‌ణ‌లో మంత్రి వాకిటి శ్రీహరి

Vaakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని.. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గాంధీభవన్‌లో మంత్రులతో 'ముఖాముఖి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌ని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా తీసుకుని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్ర‌జ‌ల నుంచి గురువారం ఆయ‌న‌ 100కు పైగా విన‌తులు స్వీక‌రించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పార్టీలకు అతీతంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోంది. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణను అప్పుల పాలు చేసింది. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలవుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు లేకపోయినా తెలంగాణ రైతులు అత్యధిక దిగుబడులు సాధించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ప్ర‌జలు వాస్తవాలను గుర్తించి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలి అని వాకిటి కోరారు.

ముఖాముఖి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధిక సంఖ్యలో ప్రజలు వినతులు అందజేశారు. ఈ ప్రభుత్వం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోంది. బీఆర్ఎస్‌ మాటల గారడీతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వారు ఇప్పుడు మూడు నెలలు అప్పగించమని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని ఆయ‌న విమ‌ర్శించారు.

ఈ కార్యక్రమంలో ముఖాముఖి కమిటీ కన్వీనర్ మద్దుల గాల్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు, కమిటీ సభ్యులు సంతోష్ ముదిరాజ్, హైమలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement