త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్ష‌మాప‌ణ‌లు..!

Actor Imran Khan | ఇకపై తాను ఎలాంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు బాంబే హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ సమర్పించారు. భవిష్యత్తులో ఇతరులను నిరసనల్లో పాల్గొనాలని ప్రేరేపించడం, ప్రభావితం చేయడం కూడా చేయబోనని హామీ ఇచ్చారు.

P

Entertainment | Published On Nov 2, 2026, 7.15 pm IST

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్ష‌మాప‌ణ‌లు..!
Advertisement

Actor Imran Khan | ఇకపై తాను ఎలాంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు బాంబే హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ సమర్పించారు. భవిష్యత్తులో ఇతరులను నిరసనల్లో పాల్గొనాలని ప్రేరేపించడం, ప్రభావితం చేయడం కూడా చేయబోనని హామీ ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఈ అఫిడవిట్‌ను సమర్పించారు. ఇందులో నటుడి సంతకంతో కూడిన బేషరతు క్షమాపణతో పాటు భవిష్యత్తులో నిరసనల్లో పాల్గొనబోనని రాతపూర్వక హామీ ఇచ్చారు. వివాదానికి కారణమైన నిరసన కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశం తనకు లేదని ఇమ్రాన్ ఖాన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మాత్రమే వెళ్లానని, కేవలం ప్రేక్షకుడిగానే అక్కడ ఉన్నానని వివరించారు. తాను ఎలాంటి డిమాండ్లు చేయలేదని స్పష్టం చేశారు. తనకు ఈ దేశంపై, రాజ్యాంగంపై అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తన 42 ఏళ్ల జీవితంలో 40 ఏళ్లు భారత్‌లోనే గడిపానని, దేశ చట్టాలను ఎల్లప్పుడూ గౌరవిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకున్నానని తెలిపారు. పన్నులు చెల్లించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా తన వంతుగా దేశానికి సేవ చేస్తున్నానని వివరించారు. తన జీవితం, వృత్తి, అనుబంధాలన్నీ ఈ దేశంతోనే ముడిపడి ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ఇకపై ఎలాంటి నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉంటానని పునరుద్ఘాటించారు. తన క్షమాపణ, హామీతో ఈ వివాదానికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్:

BollywoodBombay High CourtImran KhanImran Khan ApologyProtest ControversyTelugu News
Advertisement
Advertisement