Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు.. పెట్టుబడిదారులకు పండగే..
Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)లో మార్పులు వస్తాయనే అంచనాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో మంగళవారం సెన్సెక్స్ 1,225.07 పాయింట్లు, నిఫ్టీ 370.05 పాయింట్లు లాభపడ్డాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 75,692.78 వద్ద, నిఫ్టీ 23,440.80 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజులోనే మార్కెట్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.

షేర్ల వారీగా చూస్తే బీఎస్ఈ లిమిటెడ్, టాటా కన్స్యూమర్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. రంగాల వారీగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.5 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలవగా, నిఫ్టీ రియాల్టీ 2.20 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.78 శాతం పెరిగాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మీడియా సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.92 శాతం, నిఫ్టీ మెటల్ 0.59 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.4 శాతం చొప్పున నష్టపోయాయి.
మిడ్‌క్యాప్ సూచీ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.3 శాతం పెరిగాయి. మార్కెట్లో ఒడిదుడుకులకు సూచికగా భావించే ఇండియా విక్స్ 1.09 శాతం పెరిగి 15.67కు చేరింది. మరోవైపు భారత రూపాయి స్వల్పంగా బలపడింది. మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94.74 వద్ద ముగిసింది. గత ముగింపు విలువ రూ.94.90గా ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | మస్కట్ నుంచి స్వదేశానికి.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్
- ●Cisco | 27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..
- ●Patanjali Cow Ghee Seized | పతంజలి ఆవు నెయ్యిని వాడుతున్నారా? వెంటనే ఇది చదవండి
- ●IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై?
- ●Pooja Hegde | ఉన్న ఒక్క ఛాన్స్ పాయే - సునీల్ శెట్టి కొడుకు మూవీ నుంచి పూజా హెగ్డే ఔట్!
- ●Dasoju Sravan | రేవంత్ ధర్నా, అమిత్ షా పాదయాత్రతో తెలంగాణకు ఏం ఒరిగింది?

KTR | మస్కట్ నుంచి స్వదేశానికి.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్

Cisco | 27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..

Patanjali Cow Ghee Seized | పతంజలి ఆవు నెయ్యిని వాడుతున్నారా? వెంటనే ఇది చదవండి

IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై?