త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Chandrababu | ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌గా కోలుకోవాలి : సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu | ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రి‌లో భుజం స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నారు.

S

National | Published On Jul 12, 2026, 4.53 pm IST

CM Chandrababu | ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌గా కోలుకోవాలి : సీఎం చంద్ర‌బాబు
Advertisement

CM Chandrababu | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రి‌లో భుజం స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నారు. అయితే ఆస్ప‌త్రిలోనే ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇక పవన్ కళ్యాణ్ కుడి భుజానికి డాక్టర్లు మూడున్నర గంటల పాటూ సర్జరీ చేశారు. రెండు నెలల తర్వాత పవన్ ఎడమ భుజానికి సర్జరీ చేయనున్నారు. 2016లో పవన్ కళ్యాణ్‌కు భుజానికి గాయాల‌య్యాయి.. ఆ సమయంలోనే విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వరుసగా రాజ‌కీయ‌ సమావేశాలలో పాల్గొన్నారు.. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సమయంలో జనసేన నేతలు, కేడర్ పవన్ కళ్యాణ్‌ దగ్గరగా వెళ్లి చేతులు కలిపిన సమయంలో లాగేవారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నొప్పితో బాధపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సమయంలోకూడా అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చారు. దీంతో ఆయన ఈ గాయాల నొప్పి భరిస్తూ వస్తున్నారు.

Advertisement
Advertisement