Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన బంగారం ధర..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధం మొదలు కావడంతో అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. గత పది రోజుల నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు మళ్లీ వరుస సెషన్లలో తగ్గుముఖం పట్టాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధం మొదలు కావడంతో అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. గత పది రోజుల నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు మళ్లీ వరుస సెషన్లలో తగ్గుముఖం పట్టాయి. సోమవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.45 శాతం మేర తగ్గి 4,434 డాలర్లకు చేరగా, వెండి ధర 0.40 శాతం పెరిగి 66 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1.25 శాతం మేర పతనమై 1,54,337 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1.53 శాతం మేర పెరిగి 2,40,325 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే సుమారు రూ.15వేల తగ్గుదల చోటు చేసుకుంది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,677 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,25, 416గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,56,770 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,67,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.14,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,370 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,37,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,785 ఉండగా, 8 గ్రాముల ధర రూ.94,280గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,78,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,300 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
సెప్టెంబర్ 4, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.33వేలు పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం..
సెప్టెంబర్ 3, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ధరలు భారీగా పతనం..
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



