త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP Student Protest | జంతర్ మంతర్ ప్రొటెస్ట్: మళ్లీ భగ్గుమన్న సీజేపీ.. కేంద్రానికి 24 గంటల అల్టిమేటం, చేతులు కలిపిన కపిల్ సిబల్

జంతర్ మంతర్ వద్ద ఆందోళన విరమించిన CJP మళ్లీ పోరుబాట పట్టేందుకు సిద్ధమైంది. విద్యార్థులపై కేసులు, పోలీసుల యాక్షన్‌తో కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

J

National | Published On Jul 27, 2026, 7.14 pm IST

CJP Student Protest | జంతర్ మంతర్ ప్రొటెస్ట్: మళ్లీ భగ్గుమన్న సీజేపీ.. కేంద్రానికి 24 గంటల అల్టిమేటం, చేతులు కలిపిన కపిల్ సిబల్
Advertisement
  • విద్యార్థులపై పెట్టిన FIR లను వెనక్కి తీసుకోకపోతే మళ్లీ దేశవ్యాప్త నిరసనలు చేపడతామని కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరిక
  • జులై 25న కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని, పలు రాష్ట్రాల్లో విద్యార్థులపై అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపణ
  • విద్యార్థులకు న్యాయపరమైన సాయం అందించేందుకు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ రూ.కోటి విరాళం ప్రకటన
  • పోలీసుల తీరుపై ఫిర్యాదులకు 'సాక్షి' ప్లాట్‌ఫామ్ లాంచ్
  • ప్రధానికి, కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని పోలీసుల ఐటీ యాక్ట్ నోటీసులు

CJP Student Protest | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గతంలో 49 రోజుల పాటు జరిగిన ఆందోళనలు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, జులై 25న కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కుదిరిన ఒప్పందం తర్వాత నిరసనలు విరమించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తాజాగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ సోమవారం రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్‌తో కలిసి CJP నాయకులు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఒప్పందం బ్రేక్.. మళ్లీ ప్రొటెస్ట్ తప్పదు

కేంద్ర ప్రభుత్వం తమకిచ్చిన మాట తప్పిందని.. నిరసనకారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోమని చెప్పి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేస్తోందని CJP ప్రతినిధి అభిషేక్ రంకా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. "బీహార్, బెంగాల్‌లలో వందలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వాలంటీర్లను టార్గెట్ చేస్తూ సర్వేలెన్స్ పెంచారు. నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) లన్నింటినీ వెంటనే విత్‌డ్రా చేసుకోవాలి, లేదంటే మళ్లీ ప్రొటెస్ట్ (Protest) స్టార్ట్ చేస్తాం" అని హెచ్చరించారు. రేపటిలోగా లిఖితపూర్వక ఒప్పందాన్ని తమకు అందించాలని డెడ్‌లైన్ విధించారు.

విద్యార్థులపై కొనసాగుతున్న పోలీసుల యాక్షన్

పోలీసుల యాక్షన్‌పై CJP మెంబర్ రత్న సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసోంలో 7-8 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, కోల్‌కతాలో 11 మందిని అరెస్ట్ చేయగా.. వారిపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. బీహార్‌లో 86 మందిని అరెస్ట్ చేశారని, ఈ కష్టకాలంలో విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

CJP Threatens Nationwide Protest Kapil Sibal Offers 1Cr Legal Aid

మరోవైపు.. జంతర్ మంతర్ ఆందోళనలకు సంబంధించి ప్రధాని మోదీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులను, AI-జనరేటెడ్ అబ్యూజివ్ కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఐటీ చట్టం (IT Act) కింద నోటీసులు జారీ చేయడం మరింత కలకలం రేపుతోంది.

కపిల్ సిబల్ రూ. కోటి విరాళం.. 'సాక్షి' యాప్ లాంచ్

కష్టాల్లో ఉన్న స్టూడెంట్స్‌కు లీగల్ సపోర్ట్ (Legal support) అందించేందుకు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ముందుకొచ్చారు. న్యాయ సహాయ వేదికను ఏర్పాటు చేసేందుకు తన వంతుగా రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న లాయర్లు విద్యార్థులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ (Facial recognition) టెక్నాలజీ ద్వారా ఆందోళనకారులను టార్గెట్ చేస్తున్నారని.. దీనికి మతపరమైన రంగు పులిమే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

అదేవిధంగా, పోలీసుల దౌర్జన్యాలను వీడియోలు, ఫోటోల రూపంలో బయటపెట్టేందుకు CJP 'సాక్షి' (Saakshi) అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సైతం లాంచ్ చేసింది. జులై 25 నాటి ఒప్పందం నిలబడుతుందా? లేదా దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు చెలరేగుతాయా అనేది రాబోయే 24 గంటల్లో తేలనుంది.

Advertisement
Advertisement