త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | అభిజీత్ స‌హా సీజేపీ నేత‌ల విడుద‌ల.. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం

CJP | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) సహా ఆ పార్టీ నేత‌కు ఊర‌ట ల‌భించింది. దిప్కేతోపాటు సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా (Ashutosh Ranka), సౌరవ్ దాస్‌ను (Saurav Das) విడుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు.

G

National | Published On Oct 11, 2026, 11.13 am IST

CJP | అభిజీత్ స‌హా సీజేపీ నేత‌ల విడుద‌ల.. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం
Advertisement

CJP | త్రినేత్ర న్యూస్‌: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) సహా ఆ పార్టీ నేత‌కు ఊర‌ట ల‌భించింది. దిప్కేతోపాటు సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా (Ashutosh Ranka), సౌరవ్ దాస్‌ను (Saurav Das) విడుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈమేర‌కు సీజేపీ నేత‌ రత్నాసింగ్ వెల్లడించారు.

జంత‌ర్‌మంత‌ర్ 2.0 ముట్ట‌డి సంద‌ర్భంగా ముంబై నుంచి ఢీల్లీ చేరుకున్న ముగ్గురు నేత‌ల‌ను పోలీసులు విమానంలోనే నిర్బంధించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం వారిని అజ్ఞాతంలోకి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో ఆదివారం ఉద‌యం ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేష‌న్‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఏడాదిపాటు ఎలాంటి శాంతిభద్రతల సమస్యలను సృష్టించకుండా ఉండాల‌నే షరతుపై కోర్డు వారిని విడుదల చేసింది.

ఈ నేప‌థ్యంలో `ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అభిజీత్ దిప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను విడుదల చేయక తప్పలేదు. బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు.` అంటూ సీజేపీ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేసింది. మ‌రోవైపు అదివారం మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రతినిధి అశుతోశ్​ రంకా తెలిపారు.

Advertisement
Advertisement