త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chalo Jantar Mantar | వెన‌క్కి త‌గ్గేదే లే!.. మ‌రోసారి ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన సీజేపీ.. ఢిల్లీలో కొన‌సాగుతున్న ఆంక్ష‌లు

Chalo Jantar Mantar | దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఓటర్ల జాబితా (Vote Chori) సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్ర‌ధాన ఎన్నికల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) మ‌రోసారి ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది.

G

National | Published On Oct 11, 2026, 8.09 am IST

Chalo Jantar Mantar | వెన‌క్కి త‌గ్గేదే లే!.. మ‌రోసారి ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన సీజేపీ.. ఢిల్లీలో కొన‌సాగుతున్న ఆంక్ష‌లు
Advertisement

Chalo Jantar Mantar | త్రినేత్ర న్యూస్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఓటర్ల జాబితా (Vote Chori) సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్ర‌ధాన ఎన్నికల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) మ‌రోసారి ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ (Chalo Jantar Mantar) వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అరెస్టుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని, నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్న‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గేది లేద‌ని సీజేపీ జాతీయ సంస్థాగత బాధ్యుడు అజింక్యా షిండే (Ajinkya Shinde) స్పష్టం చేశారు. సీఈసీ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని ప్రకటించారు.

`అరెస్టులు చేయగానే అందరూ ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం భావించింది. ప్ర‌ధాని మోదీ, అమిత్ షాలలో కనిపిస్తున్న ఈ భయమే.. మేము సగం యుద్ధం గెలిచామని నిరూపిస్తున్న‌ది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు మా పోరాటం ఆగదు` అని షిండే తేల్చిచెప్పారు. కాగా, సీజేపీ నిరసనలు శనివారం ఒక్కరోజే ఉండాలి. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఆదివారం కూడా ఆందోళనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.

శ‌నివారం సీజేపీ చేపట్టిన 'జంతర్ మంతర్ 2.0' మహా ధర్నా పిలుపుతో శనివారం ఢిల్లీ స్తంభించిపోయింది. పోలీసుల అనుమతి లేకుండానే వేలాది మంది కార్యకర్తలు, విపక్ష నేతలు నిరసనకు సిద్ధం కావడంతో ఢిల్లీ వ్యాప్తంగా అసాధారణ భద్రతా ఆంక్షలు అమలయ్యాయి. ఉదయం విమానాశ్రయం రన్‌వేపై హైడ్రామా మొదలుకొని, సాయంత్రం వేలాది మందిని నిర్బంధించడం దాకా రాజధానిలో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke), కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు విమానంలోనే నిర్బంధించారు. అక్క‌డి నుంచి అజ్ఞాత ప్రాంతానికి త‌ర‌లించారు. ఇప్ప‌టికీ వారి ముగ్గురు ఎక్క‌డు ఉన్నార‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు. మ‌రోవైపు శ‌నివారం జంత‌ర్‌మంత‌ర్ వైపు వెళ్తున్న సుమారు 7 వేల మందికిపైగా నిర‌స‌న కారుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారంద‌ర‌నీ సాయంత్రానికి వ‌దిలేశారు.

తాజా పిలుపు నేప‌థ్యంలో ఢిల్లీలో ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పోలీసుల ప్ర‌క‌టించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ సహా కీలక ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో జంతర్ మంతర్, కనాట్ ప్లేస్, మండి హౌస్, పటేల్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement