త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohan Bhagwat | ముస్లింలు లేకుండా హిందూ రాజ్యం అనే భావ‌నే లేదు: భాగవత్‌

Mohan Bhagwat | భార‌త‌దేశపు డీఎన్ఏలోనే (DNA) భిన్న‌త్వంలో ఏక‌త్వం ఉంద‌ని రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) అన్నారు. భారత్‌లో (Bharat) ముస్లింలు ఉండకూడదని ఎవరైనా అనుకుంటే వారు అసలు... హిందువే కాదని చెప్పారు.

G

International | Published On Aug 30, 2026, 9.31 am IST

Mohan Bhagwat | ముస్లింలు లేకుండా హిందూ రాజ్యం అనే భావ‌నే లేదు: భాగవత్‌
Advertisement

Mohan Bhagwat | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త‌దేశపు డీఎన్ఏలోనే (DNA) భిన్న‌త్వంలో ఏక‌త్వం ఉంద‌ని రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) అన్నారు. భారత్‌లో (Bharat) ముస్లింలు ఉండకూడదని ఎవరైనా అనుకుంటే వారు అసలు... హిందువే కాదని చెప్పారు. ముస్లింలు లేకుండా హిందూ రాజ్యం అనే భావనే లేదని వెల్ల‌డించారు. ‘అమెరికన్‌ హిందూ ఫర్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ డైలాగ్‌’ (AHEAD) ఆధ్వర్యంలో విశ్వ ఐక్య‌తా వేడుక పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌లో మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అమెరికా అనగానే బ‌హుళ‌త్వం (Plurality) గుర్తొస్తుంద‌ని, భార‌త్ అంటే భిన్న‌త్వంలో ఏక‌త్వం (Unity in diversity)స్ఫురిస్తుంద‌ని, ఈ రెండూ భార‌తీయుల జ‌న్యువుల్లోనే ఉన్నాయ‌ని చెప్పారు.

ధ‌ర్మం అనేది కేవ‌లం పూజ లేదా మ‌తం కాద‌ని, విశ్వాన్ని నిల‌బెట్టే మూల సూత్ర‌మ‌ని తెలిపారు. స‌త్యాన్వేష‌ణ ద్వారా మోక్షం పొంద‌డ‌మే మాన‌వ జ‌న్మ అంతిమ ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. మాన‌వ జీవితం అనేది కేవలం ఒక యాదృచ్ఛికం కాద‌ని పేర్కొన్నారు. మనమంతా ఒక్కటేన‌ని, మన మధ్య విభేదాలు ఒక భ్రమ అని వెల్ల‌డించారు. అన్ని మతాల మార్గాలు ఒకే లక్ష్యానికి తీసుకెళ్తాయని గుర్తించాల‌న్నారు. మనుషుల మధ్య ఎలాంటి తేడా లేద‌ని తెలిపారు. మిమ్మల్ని మీరు హిందువు అని చెప్పుకోవాలనుకుంటే, అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి చేరుకుంటాయని మీరు నమ్మాల‌న్నారు. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంద‌ని తెలిపారు. విదేశీయుల ఆక్రమణల్లో చాలా కోల్పోయినా మన సంస్కృతి-సంప్రదాయాలు పదిలంగానే ఉన్నాయ‌ని చెప్పారు. ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూసే గుణాన్ని మరవలేదు. ఆరెస్సెస్‌ స్వయం సేవకులు అన్నిచోట్లా సేవలందిస్తార‌ని, సేవ చేసేటప్పుడు హిందువులా, ముస్లిములా అని చూడరని వెల్ల‌డించారు. దాదాపు 5 వేల మందికిపైగా హాజ‌రైన ఈ స‌భ‌లో ప‌లు సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

భారతీయ ప్రవాసులు తాము నివసిస్తున్న దేశానికి విధేయులుగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత్‌ వారి జన్మభూమి అయినప్పటికీ, తాము నివసిస్తూ, పనిచేస్తున్న దేశమే కర్మభూమి అని చెప్పారు. కర్మభూమి పట్ల తమ బాధ్యతలను ముందుగా నెరవేర్చాలన్నారు. ప్ర‌స్తుత‌ రాజకీయాలు, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో, ప్రజాభిప్రాయంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. ప్రజాభిప్రాయం ఉంటే, ఏ రాజకీయ నాయకుడు దానికి వ్యతిరేకంగా వెళ్లడానికి సాహసించడని చెప్పారు.

Advertisement
Advertisement