త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC Parks | జీహెచ్ఎంసీ పార్కుల్లో ప్ర‌వేశ రుసుము పెంపు..!

GHMC Parks | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప్ర‌ధాన పార్కులకు( GHMC Parks ) వెళ్లే వారికి అధికారులు షాకిచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌వేశ రుసుముల ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

S

Hyderabad | Published On Nov 17, 2026, 8.50 am IST

GHMC Parks | జీహెచ్ఎంసీ పార్కుల్లో ప్ర‌వేశ రుసుము పెంపు..!
Advertisement

GHMC Parks | త్రినేత్ర న్యూస్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప్ర‌ధాన పార్కులకు( GHMC Parks ) వెళ్లే వారికి అధికారులు షాకిచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌వేశ రుసుముల ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో ప్ర‌వేశ రుసుము పెంపు ప్ర‌తిపాద‌న‌ల‌కు అధికారులు ఆమోదం తెలిపారు.

పెద్ద‌ల‌కు ప్ర‌స్తుతం ప్ర‌వేశ రుసుము రూ. 10 ఉండ‌గా, దాన్ని రూ. 20కి పెంచారు. ఇక పిల్ల‌ల‌కు రూ.2 ఉన్న టికెట్‌ను రూ. 5కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. 12 ఏళ్లు పైబ‌డిన వారు క‌చ్చితంగా రూ. 20 చెల్లించాల్సిందే. ఇక ఐదేండ్ల లోపు చిన్నారుల‌కు పార్కుల్లో ప్ర‌వేశం ఉచితం.

ఇందిరాపార్కు, నారాయణగూడలోని మేల్కొటే, జలగం వెంగళరావు, కృష్ణకాంత్‌ తదితర ప్రధాన పార్కుల్లో ప్ర‌వేశ రుసుం పెంపు అమలు కానుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఎప్పటిలాగానే ప్రవేశ రుసుము టికెట్లు ఇస్తారు.

Advertisement
Advertisement