DRDO | డీఆర్‌డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
DRDO | భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలో పనిచేసే ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
DRDO | త్రినేత్ర.న్యూస్: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలో పనిచేసే ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 111 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యటూర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, సివిల్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హలు. ఈ నెల 13 వరకు https://ada.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు రెండేండ్ల కాలపరితికి బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. పనితీరు ఆధారంగా ఉద్యోగాన కాలపరిమితిని పొడిగిస్తారు.
మొత్తం పోస్టులు: 111
పోస్టు పేరు: ప్రాజెక్టు అసిస్టెంట్-1
విభాగాల వారీగా ఖాళీలు..
కంప్యూటర్ సైన్స్- 15
అర్హత: ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 20
అర్హత: ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంఈ, ఎంటెక్
ఏరోనాటికల్ ఇంజినీరింగ్- 10
అర్హత: ఏరోస్పేస్‌లో ఎంఈ, ఎంటెక్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 20
అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంఈ, ఎంటెక్
మెకానికల్ ఇంజినీరింగ్- 43
అర్హతలు: ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఎంఈ, ఎంటెక్
మెటలర్జీ ఇంజినీరింగ్- 1
అర్హత: మెటీరియల్ సైన్స్‌లో ఎంఈ, ఎంటెక్
సివిల్ ఇంజినీరింగ్- 2
అర్హత: ఎంఈ, ఎంటెక్
వయస్సు: ఆగస్టు 13 నాటికి 28 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. గేట్ (GATE) వ్యాలిడ్ స్కోర్ ఉన్నవారికి కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 13
రాతపరీక్ష: ఆగస్టు 16, 23, 30 తేదీల్లో
వెబ్‌సైట్: https://ada.gov.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- ●Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
- ●Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
- ●Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..
- ●oxygen cylinder explodes | పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!

Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?

Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..






