DRDO | ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు.. డీఆర్డీవో హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ సక్సెస్..!
DRDO | రక్షణ రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన హై ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ (HAPS)ను డీఆర్డీవో మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
DRDO | రక్షణ రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన హై ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ (HAPS)ను డీఆర్డీవో మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంలో ప్లాట్‌ఫామ్ ఏకంగా 21 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అనంతరం సుమారు 20 కిలోమీటర్ల ఎత్తులో 30 నిమిషాలకు పైగా ప్రయాణించి తన సుదీర్ఘకాలిక స్ట్రాటోస్ఫెరిక్ ఫ్లైట్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రయోగాత్మక విమానం సముద్ర మట్టానికి 21 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అనంతరం 20 కిలోమీటర్ల ఎత్తులో 30 నిమిషాలకు పైగా కొనసాగింది. తర్వాత భూమికి తిరిగి రావాలని ఆదేశించగా.. ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా రికవరీ చేశారు. ప్రయోగానికి సంబంధించిన ఫ్లైట్ డేటాను విశ్లేషించి పనితీరును అంచనా వేశారు.
స్ట్రాటోస్ఫియర్‌లో పనిచేసే సామర్థ్యాన్ని ఈ పరీక్ష ద్వారా HAPS ప్రదర్శించింది. ఈ ప్రాంతం దీర్ఘకాలిక నిఘా, కమ్యూనికేషన్స్, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయోగ సమయంలో గాల్లో ఉన్న ప్లాట్‌ఫామ్ నుంచి రియల్‌టైమ్ వీడియోతో పాటు వాహన పనితీరుకు సంబంధించిన డేటాను నిరంతరం గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కు పంపించారు. ఈ వ్యవస్థలో ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU), GPS రిసీవర్, ఆన్‌బోర్డ్ కెమెరాలు, ఎత్తు నియంత్రణ వ్యవస్థలతో పాటు పలు ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. ప్రయోగం మొత్తం ఇవన్నీ సక్రమంగా పనిచేశాయి. ఈ ఫ్లైట్ ట్రయల్‌ను భారత వైమానిక దళం (IAF), సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ (CEMILAC), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)తో పాటు ఇతర పౌర సంస్థల సమన్వయంతో నిర్వహించారు.
ఆగ్రాలోని డీఆర్డీవోకు చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADRDE) ఈ హై ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. తేలికపాటి గాలికంటే తేలికైన (lighter-than-air) ఈ వ్యవస్థను స్ట్రాటోస్ఫియర్‌లో ఎక్కువ కాలం పనిచేసేలా రూపొందిస్తున్నారు. దీని ద్వారా నిఘా, పర్యవేక్షణ తదితర కార్యకలాపాలను దీర్ఘకాలం నిర్వహించే అవకాశం ఉంటుంది. హాప్స్ టెస్ట్ విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో, భారత వైమానిక దళం, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. అధునాతన ఏరోస్పేస్ టెక్నాలజీల్లో స్వావలంబన దిశగా, దీర్ఘకాలిక స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్‌షిప్ అభివృద్ధిలో ఈ విజయం కీలక మైలురాయని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jason Sanjay | నేను లవ్ ఫెయిల్యూర్నే - బ్రేకప్‌పై దళపతి విజయ్ కొడుకు కామెంట్స్
- ●ACB Raids Telangana | కోరుట్ల ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: ఎంవీఐ బదులు కానిస్టేబులే డ్రైవింగ్ టెస్టులు
- ●Sourav Ganguly | ఇకనైనా తలరాత మారేనా..? ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా సౌరవ్ గంగూలీ
- ●Anaswara Rajan | మాస్ మహారాజా సినిమాలో మలయాళ హీరోయిన్...టాలీవుడ్లో అనస్వరకు మరో ఛాన్స్
- ●Ramchandar Rao | రాహుల్! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన
- ●Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!

Jason Sanjay | నేను లవ్ ఫెయిల్యూర్నే - బ్రేకప్‌పై దళపతి విజయ్ కొడుకు కామెంట్స్

ACB Raids Telangana | కోరుట్ల ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: ఎంవీఐ బదులు కానిస్టేబులే డ్రైవింగ్ టెస్టులు

Sourav Ganguly | ఇకనైనా తలరాత మారేనా..? ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా సౌరవ్ గంగూలీ

Anaswara Rajan | మాస్ మహారాజా సినిమాలో మలయాళ హీరోయిన్...టాలీవుడ్లో అనస్వరకు మరో ఛాన్స్





