త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar babu | మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు దంప‌తుల‌పై ఏఐ వీడియో క‌ల‌క‌లం.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Sridhar babu | తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌లను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించాయి. దుండ‌గులు ఫేస్‌బుక్‌లో నిరాధార‌మైన‌ కంటెంట్‌తో కూడిన తప్పుడు వీడియోలను పోస్టు చేసి ప్ర‌చారం చేశారు.

S

Telangana | Published On Jun 30, 2026, 1.18 pm IST

Sridhar babu | మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు దంప‌తుల‌పై ఏఐ వీడియో క‌ల‌క‌లం.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
Advertisement

Sridhar babu | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌లను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించాయి. దుండ‌గులు ఫేస్‌బుక్‌లో నిరాధార‌మైన‌ కంటెంట్‌తో కూడిన తప్పుడు వీడియోలను పోస్టు చేసి ప్ర‌చారం చేశారు. దీనిపై న్యాయవాది శశిభూషణ్ కాశే ఫిర్యాదు చేయ‌గా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంత‌కీ ఏఐ మార్ఫింగ్ కంటెంట్‌ ఏంటంటే..

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిధుల అక్రమాల పేరుతో మంత్రి శ్రీధర్ బాబు, శైలజా రామయ్యర్ దంపతులను అవినీతిపరులుగా కొందరు ఆకతాయిలు చిత్రీకరించారు. ఏఐ సాయంతో తప్పుడు వీడియోలను, ఫేక్ రీల్స్‌ను సృష్టించి ప్రచారం చేశారు. హోదాలను అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారంటూ నిరాధార ఆరోపణలతో కంటెంట్‌ను సృష్టించి వీడియోలు వైర‌ల్ చేశారు.

వారిద్దరి వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మంత్రి స‌న్నిహితులు, అధికారులు పేర్కొంటున్నారు. ఈ తప్పుడు ప్రచారంపై శ్రీ‌ధ‌ర్‌బాబు సన్నిహితులు, అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా కేసు నమోదైంది. ఆ త‌ప్పుడు వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించే చర్యలు చేపట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement