Kavitha | కొడంగల్‌లో 11 వేల కర్ణాటక ఓట్లున్నయ్.. అందుకే రేవంత్ గెలిచిండు
Kavitha | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కర్ణాటక రాష్ట్రంలోని సెడం నియోజకవర్గ నుంచి 11 వేల మంది ఓటర్లుగా ఉన్నారని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అలాగే 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు.
- డూబ్లికేట్, సెడెం ఓట్లు కలిపి 33 వేలు ఉన్నయ్
- అదే మార్జిన్‌తోనే రేవంత్ గెలిచిండు
- బోధన్‌లో ఏడు వేల ఓట్లు తీసెస్తే కొడంగల్‌లో 808 మాత్రమే తొలగించారు
- ఓట్లు తీసేసేముందు మూడుసార్లు నోటీసులివ్వాలి
- ఎస్ఐఆర్ మీద చాలా అనుమానాలున్నయ్.. అన్నింటిపై ఈసీ క్లారిటీ ఇవ్వాలి
- ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను ఏరేసే మెకానిజం ఈసీ వద్దా ఉందా?
- అది లేకుంటే రూ.1400 కోట్లు దండగే
- వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు విధానం ఉండాలి
- మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
Kavitha | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కర్ణాటక రాష్ట్రంలోని సెడం నియోజకవర్గ నుంచి 11 వేల మంది ఓటర్లుగా ఉన్నారని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అలాగే 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. సరిగ్గా అంతే మార్జిన్‌తో రేవంత్ గెలిచారన్నారు. సీఎంకు ఈసీ ఫేవర్ చేసిందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. బోధన్‌లో ఏడాదిన్నరలో ఏడు వేల ఓట్లు తొలగించారని.. కొడంగల్‌లో పరిశీలిస్తే కేవలం 808 ఓట్లే తొలగించారని తెలిపారు. డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపోటములు నిర్ణయించబడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం బంజారాహిల్స్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు.
1000 ఓట్ల వరకు ప్రింట్ తీశాం...
కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా? మా బోధన్‌లో 7 వేల ఓట్లు తొలగించారు. వాళ్లు షిప్ట్ అయ్యారా, చనిపోయారా? డూప్లికేషన్ ఓట్ల అనేది ఈసీ చెప్పటం లేదు. మిగతా నియోజకవర్గాల్లో అలాగే జరిగిందా అన్న అనుమానంతో మేం కొడంగల్‌లో చెక్ చేశాం. అక్కడ కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించారు. కొడంగల్‌లో దాదాపు 22, 433 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. అందులో దాదాపు వెయ్యి వరకు మేం ప్రింట్ తీశాం. 2018లో కొడంగల్ ఉన్న ఓట్ల సంఖ్యతో పోల్చుకుంటే 2023 నాటికి దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయి. పైగా కొడంగల్‌కు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం అనే నియోజకవర్గం నుంచి 11 వేల మంది ఓటర్లు కొడంగల్‌లో ఉన్నారు. సెడంలో, కొడంగల్‌లోనూ 11 వేల మంది ఓటర్లు ఎలా ఉంటారు అని ఆమె ప్రశ్నించారు.
కొడంగల్‌లో ఉన్న డూప్లికేషన్, సెడంకు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో దాదాపు 33 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. అంటే డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా అనే అనుమానం వస్తోంది. ఈ ఎస్ఐఆర్ ద్వారా దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలి. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే పరిస్థితి ఉండాలి. కచ్చితంగా ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, డూప్లికేషన్ అంశంపై దృష్టి పెట్టాలి అని కవిత డిమాండ్ చేశారు.
సంచార జాతుల వాళ్లకు ఓట్లు ఎలా ఇస్తారో చెప్పాలి?
దేశంలో ఉండే సంచార జాతుల వాళ్లకు ఏ విధంగా ఓటు ఇస్తారో చెప్పాలి? ఒక ఇంట్లో ఉండే వాళ్లందరికీ ఓకే బూత్‌లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎస్ఐఆర్ ద్వారా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను కూడా కట్ చేయాలి. లేదంటే ఎస్ఐఆర్‌కు అర్థం ఉండదు.
జనవరి 1 నుంచే రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై మాకు చాలా అనుమానాలున్నాయి. సాధారణంగా ఎస్ఐఆర్‌కు రిఫరెన్స్ ను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకోవాలి. కానీ 2025, జనవరి నుంచి వీళ్లు ఎస్ఐఆర్‌కు రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నారు. ఏటా నిర్వహించే ఎస్ఎస్ఆర్ రిఫరెన్స్ పాయింట్ అయిన జనవరి 1వ తేదీనే తీసుకోవాలి. కానీ అలా కాకుండా గతేడాది జనవరి 1ని ఎస్ఐఆర్‌కు రిఫరెన్స్ పాయింట్ చేశారు అని టీఆర్ఎస్ చీఫ్ విమర్శించారు.
ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలి..
2025, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఒక్క బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ ఓట్లకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని ఈసీని కోరుతున్నాం. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్‌కు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారు. ఆ ఓట్లను తొలగించేందుకు ఏడు ఏళ్లు పడితే బోధన్‌లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించారు. ఒక నియోజకవర్గంలో 2 శాతం కంటే ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉంది. కానీ ఆ విధంగా ఎవరికీ నోటీసు ఇవ్వలేదు. ఇస్తే ఈసీ దీని గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి అని కల్వకుంట్ల కవిత సూచించారు.
రూ.1400 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి?
రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? మన దేశంలో వేరే దేశంలో వాళ్లకు ఓట్లు ఉండవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. దానికి మేం అంగీకరిస్తాం. కానీ ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వాళ్లకు మరొక రాష్ట్రంలో ఉండవచ్చా? మీరు ఒక రాష్ట్రంలో వేరే దేశ పౌరుడి ఓటు తొలగిస్తే వాళ్లు మరొక రాష్ట్రానికి వచ్చి నమోదు చేసుకోరా? అసలు ఇంటర్ స్టేట్‌లో ఓట్ల డూప్లికేషన్‌ను ఏరివేసేందుకు ఈసీ దగ్గర మెకానిజమే లేదు. అలాంటప్పుడు రూ.1400 కోట్లు పెట్టి ఎస్ఐఆర్ చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అని ఆమె నిలదీశారు.
మాలాంటి కొత్త పార్టీకి చాలా ముఖ్యం..
ఎస్ఐఆర్ ద్వారా దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలి. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే పరిస్థితి ఉండాలి. ఎస్ఐఆర్ అనేది పర్మినెంట్ సొల్యుషన్‌గా ఉండాలని మేం కోరుతున్నాం. మాలాంటి కొత్త పార్టీకి ఇది చాలా ఇంపార్టెంట్. కచ్చితంగా ఫెయిర్‌గా ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఈసీని కోరుతున్నాం. మేం లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ ఈసీ సమాధానం చెప్పాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం అని టీఆర్ఎస్ చీఫ్ కవిత పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే
- ●Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
- ●Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- ●Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్..

Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!

Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే

Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం




