Joginapally Santosh Kumar | ఐసీఎఫ్ఎస్ పరిశోధనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి : జోగినపల్లి సంతోష్ కుమార్
Joginapally Santosh Kumar | లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ (London Climate Action Week) పర్యటనలో భాగంగా అంతర్జాతీయ సుస్థిరత కేంద్రం (ICFS) సందర్శన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) పేర్కొన్నారు.
Joginapally Santosh Kumar | లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ (London Climate Action Week) పర్యటనలో భాగంగా అంతర్జాతీయ సుస్థిరత కేంద్రం (ICFS) సందర్శన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐసీఎఫ్ఎస్ (ICFS) ప్రతినిధి సచిన్ నందా, బృందంతో ప్రత్యేకంగా భేటీ అవడం సంతోసాన్నిచ్చిందన్నారు.
భారతదేశం, పాశ్చాత్య దేశాల మధ్య ప్రజలు, పర్యావరణం, ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ఈ సంస్థ పరిశోధనలు సాగిస్తోందని సంతోష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా యూకే–భారత్ సంబంధాలు, పర్యావరణం-సంస్కృతి, సుస్థిర ఆర్థిక వ్యవస్థతో పాటు భవిష్యత్తులో ప్రజాస్వామ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆరోగ్య సంరక్షణ (preventative healthcare) వంటి వైవిధ్యభరితమైన అంశాలపై వారు చేస్తున్న విస్తృత పరిశోధనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు.
జాతీయ భద్రతలో 'నీటి సంరక్షణ' అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఐసీఎఫ్ఎస్ బృందం స్పష్టం చేసిందన్నారు. వారి లక్ష్యం తాము చేపట్టిన 'ఇగ్నైటింగ్ మైండ్స్' సంస్థ ఆశయాలకు అద్దం పడుతోందని సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు. భారతదేశం, ప్రపంచం కలిసి ఎదుగుతాయి అనే ఏకైక సత్యంతో రెండు సంస్థలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
One of the most inspiring moments of our London Climate Action Week journey: visiting @icfs2023 ,the International Centre for Sustainability and meeting the remarkable @sachinnandha and his brilliant team.
Mesmerised by the breadth of their research from UK–India relations,… pic.twitter.com/DxlsIR1krz
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 30, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Santosh Kumar IIM Bangalore | వడగాల్పులు విపత్తు కాదా? ఐఐఎం వేదికగా జోగినపల్లి సంతోష్ కుమార్ సూటి ప్రశ్న
మే 28, 2026

Joginapally Santosh Kumar | జనం నమ్మకమే నీ గెలుపు.. టీవీకే అధినేత దళపతి విజయ్‌కు సంతోష్ కుమార్ అభినందనలు
మే 4, 2026

Joginapally Santosh Kumar | బ్రిటన్ పార్లమెంట్లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు అరుదైన గౌరవం
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Niranjan Reddy | అప్పుడు మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు పడేది.. రేవంత్ సర్కారేమో పిల్లిమొగ్గలేస్తుంది
- ●Gen Dhiraj Seth | ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతల స్వీకరణ
- ●Kyama Mallesh | ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డా? కచ్చితంగా అడ్డుకుంటం
- ●Sudha Kongara | రెమ్యూనరేషన్ కోసం కోర్టులో కేసు వేసిన తమిళ డైరెక్టర్ - వివాదంలో శ్రీలీల సినిమా
- ●UIDAI | ఎం-ఆధార్ యాప్‌కు యూఐడీఏఐ గుడ్‌బై.. అందరూ కొత్త యాప్ వాడాల్సిందే..
- ●DK Shivakumar | ఓటు కోల్పోతే.. ఉచితాలు కోల్పోతారు.. SIR నేపథ్యంలో ప్రజలకు డీకే కీలక హెచ్చరికలు

Niranjan Reddy | అప్పుడు మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు పడేది.. రేవంత్ సర్కారేమో పిల్లిమొగ్గలేస్తుంది

Gen Dhiraj Seth | ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతల స్వీకరణ

Kyama Mallesh | ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డా? కచ్చితంగా అడ్డుకుంటం

Sudha Kongara | రెమ్యూనరేషన్ కోసం కోర్టులో కేసు వేసిన తమిళ డైరెక్టర్ - వివాదంలో శ్రీలీల సినిమా



