త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chardham Yatra | ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాల బీభ‌త్సం.. చార్‌ధామ్ యాత్ర‌కు బ్రేక్‌..

Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. భద్రతా కారణాల దృష్ట్యా చార్‌ధామ్ యాత్రను రెండ్రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గ‌ర్హ్వాల్ డివిజ‌న్ క‌మిష‌న‌ర్ ఆనంద్ స్వ‌రూప్ ప్రకటించారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి జాతీయ రహదారుల‌ను పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో మూసివేశారు.

P

National | Published On Jul 28, 2026, 3.36 pm IST

Chardham Yatra | ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాల బీభ‌త్సం.. చార్‌ధామ్ యాత్ర‌కు బ్రేక్‌..
Advertisement

Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. భద్రతా కారణాల దృష్ట్యా చార్‌ధామ్ యాత్రను రెండ్రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గ‌ర్హ్వాల్ డివిజ‌న్ క‌మిష‌న‌ర్ ఆనంద్ స్వ‌రూప్ ప్రకటించారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి జాతీయ రహదారుల‌ను పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో మూసివేశారు. భ‌క్తులు సుర‌క్షిత ప్రాంతాలు, బేస్ క్యాంపుల్లోనే ఉండాల‌ని సూచించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మెరుగుప‌డ్డ త‌ర్వాత ప్ర‌యాణానికి మార్గం సుర‌క్షిత‌మ‌ని నిర్ధారించిన త‌ర్వాతే యాత్ర‌ను పున‌రుద్ధ‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో అనవసర ప్రయాణాలు నివారించాల‌ని, నదులు, వాగుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానికులతో పాటు పర్యాటకులకు, భక్తులకు అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.

ఇదిలా ఉండ‌గా డెహ్రాడూన్‌లోని మాల్దేవత ప్రాంతంలో గత 24 గంటల్లో అత్యధికంగా 233 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డెహ్రాడూన్, ముస్సూరీ, జాలీ గ్రాంట్, ఉఖీమఠ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు ఉప్పొంగడంతో పలు రహదారులపై శిథిలాలు, బండరాళ్లు పేరుకుపోయాయి. నాలుగు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డెహ్రాడూన్ సమీపంలోని నందా కీ చౌకీ వద్ద రూ.16 కోట్ల వ్యయంతో ఇటీవల నిర్మించిన కొత్త వంతెన తొలి వర్షానికే దెబ్బతింది. అప్రోచ్ రోడ్డులో భారీ గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యమునోత్రి మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు కాన్వర్ యాత్రికులు గాయపడగా, టెహ్రీ జిల్లాలో తొమ్మిది గ్రామీణ రహదారులు మూసుకుపోయాయి. చమోలీ జిల్లాలో 21 గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్‌లో చెట్లు కూలడం, నీటిమునిగిన కాలనీలు, రహదారులపై శిథిలాలు పేరుకుపోవడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

 

Advertisement
Advertisement