త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంట‌వ్ రేవంత్‌?

Dasoju Sravan | రాష్ట్రంలో హైడ్రా మాన్‌స్ట‌ర్‌గా మారిందని బీఆర్ఎస్ ఎప్పట్నుంచో చెబుతోందని.. మేమంతా నెత్తి మీద నోరు పెట్టుకొని కూడా చెప్పామ‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు రేవంత్ ఏమంటారో చెప్పాల‌న్నారు. రేవంత్‌ను కూడా నిందితుడిగా తేల్చి చెంప చెళ్లుమ‌నిపించింద‌న్నారు. పైగా రంగ‌నాథ్ ఏదో గొప్ప ప‌ని చేసిన‌ట్లు కోర్టును త‌ప్పు బ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Jul 28, 2026, 3.12 pm IST

Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంట‌వ్ రేవంత్‌?
Advertisement
  • హైకోర్టు నీ చెంప చెళ్లుమ‌నిపించింది క‌దా.. ఇంకా రెండు చెంప‌లు వాయించాల్సింది
  • పైగా రంగ‌నాథ్ ఏదో పొడిసిన‌ట్టు కోర్టును త‌ప్పుబ‌డుతుండు.. నోరు మూసుకో ఇగ‌
  • రేవంతే ఆయ‌న్ని మాట్లాడిస్తుండేమో అనిపిస్తుంది
  • ఈ తీర్పుతో పాల‌క‌వ‌ర్గం ఉరేసుకొని స‌చ్చిపోవాలి
  • మీడియా స‌మావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్‌

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో హైడ్రా మాన్‌స్ట‌ర్‌గా మారిందని బీఆర్ఎస్ ఎప్పట్నుంచో చెబుతోందని.. మేమంతా నెత్తి మీద నోరు పెట్టుకొని కూడా చెప్పామ‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు రేవంత్ ఏమంటారో చెప్పాల‌న్నారు. రేవంత్‌ను కూడా నిందితుడిగా తేల్చి చెంప చెళ్లుమ‌నిపించింద‌న్నారు. పైగా రంగ‌నాథ్ ఏదో గొప్ప ప‌ని చేసిన‌ట్లు కోర్టును త‌ప్పు బ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న్ను రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడని తాము భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పాలకవర్గం ఉరేసుకొని చచ్చిపోవాలని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈమేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌, రంగనాథ్‌పై ఫైర‌య్యారు.

హైడ్రా కమిషనర్‌ను తొలగించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పు ఆషామాషీ కాదు. ఏపీ, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇట్లా అధికారులను తొలగించాలని ఇచ్చిన తీర్పులను వేళ్ల‌ మీద లెక్క పెట్టొచ్చు. హైకోర్టు తీర్పు బుల్డోజర్ రాజ్‌పై సర్జికల్ స్ట్రైక్ లాంటిదే. హైకోర్టు హైడ్రా శాడిస్టిక్ చేష్టలను ఆనందిస్తున్న రేవంత్ చెంప చెళ్లుమనిపించింది. రెండు చెంపలు వాయించాలి అని దాసోజు అన్నారు.

హైడ్రా దాష్టికాలు భరించలేకే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దాన్ని ఎట్టిపారేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇపుడు హైకోర్టు అదే చెప్పింది. ఇప్పుడు రేవంత్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? రాష్ట్రం లో సెలెక్టివ్ గవర్నెన్స్ నడుస్తోందని మా కేటీఆర్ చెప్పారు అని ఆయ‌న తెలిపారు.

రంగ‌నాథ్ ఒక తోలు బొమ్మ‌..

రంగనాథ్ నోరు మూసుకుని కూర్చోవాల్సింది. ఆయ‌న ఇంకా ఏదో గొప్ప ప‌ని చేసిన‌ట్టు మాట్లాడుతుండు. ఆయ‌న‌ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు రావా? మంత్రులు సన్నాసులుగా, బానిసలుగా మారిపోయారు. రంగనాథ్ ఒక‌ తోలు బొమ్మ.. ఆడిస్తున్నది రేవంత్ రెడ్డి. రేవంత్‌ను కూడా నిందితుడ‌ని హై కోర్టు తేల్చింది. నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డిని హైకోర్టు తీర్పే గద్దె దించుతుంది అని శ్ర‌వ‌ణ్ వ్యాఖ్యానించారు.

పేదల ఇళ్లు కూల్చిన హైడ్రా FTL లో ఉన్న అక్బరుద్దీన్ కాలేజ్ ఎందుకు కూల్చలేదు? మూసీ నది మధ్యలో ఆదిత్యా కన్‌స్ట్రక్షన్ నిర్మాణం చేస్తుంటే ఏం చేస్తున్నట్లు? రేవంత్ రెడ్డి గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూల్ చేస్తుంటే హైడ్రాకు కనిపించడం లేదా? ఇల్లు కూల్చేవాడు పాలకుడు కాదు.. ఇల్లు నిర్మించేవాడు పాలకుడు అవుతాడు. హైడ్రా భయంతో కూకట్‌పల్లి నియోజకవర్గంలో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది.
భూ కబ్జా కోరులకు పోలీసులు అండగా ఉంటున్నారు అని ఎమ్మెల్సీ దాసోజు ఆరోపించారు.

పైస‌లిస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తున్న‌రు..

రాష్ట్రంలో పోలీసులు పైసలు ఇస్తేనే FIR చేస్తున్నారు. పైసలు ఇవ్వకపోతే FIR చెయ్యడం లేదు. రేవంత్ రెడ్డి బుల్డోజర్ పరిపాలనకు చరమగీతం పాడుతా అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రా ఎత్తిపారేస్తాని కేసీఆర్ అన్నారు. మూడు సింహాలు పెట్టుకున్న IPS అధికారికి చట్టం మీద గౌరవం లేకపోతే సామాన్యులకు ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనలు చూసే జెన్ జీ యూత్ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద నిరసన చేశారు. కోర్టు ఆదేశాలను రేవంత్ రెడ్డి పాటించిన దాఖలాలు ఎక్క‌డా లేవు. హైకోర్టు తీర్పు కేబినెట్ మొత్తానికి కోరకాసు పెట్టినట్లు అయింది. రాజకీయం అంటేనే గుండాయిజం, బూత్ భాష అన్నట్లు రేవంత్ అలా మార్చాడు. రేవంత్ రెడ్డి ఆదేశాల‌ మేరకే రంగనాథ్ విధ్వంసం చేశాడు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఖబడ్దార్ అని దాసోజు శ్ర‌వ‌ణ్ హెచ్చ‌రించారు.

ఈ మీడియా స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి, బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement